ప్రముఖ బంగారు ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్ వారం కిందట విడుదల చేసిన ఓ వ్యాపార ప్రకటనపై వివాదం రాజుకుంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉన్న సంస్థ షోరూం వద్ద క్షమాపణ కోరుతూ ఓ లేఖ అతికించారు. దీంతో ఆ లేఖ వైరల్‌గా మారింది. మరోవైపు ఆ షోరూం మేనేజర్‌ను పలువురు బెదిరించారని, షోరూంపై దాడి జరిగిందంటూ వార్తలు వచ్చాయి. వాటిని మేనేజర్, పోలీసులు ఖండించారు. ఇక్కడ ఎటువంటి అల్లర్లు, నిరసనలు జరగలేదని పోలీసులు వివరించారు. ఏకత్వం పేరుతో రూపొందించిన ఈ ప్రకటనలో ఏముందంటే.. హిందూ మహిళ ముస్లిం కుటుంబానికి కోడలుగా వెళ్తుంది. కోడలు గర్భవతి అయిన సందర్భంగా ఆ కుటుంబం మహిళకు శ్రీమంతం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో మహిళకు ఆ కుటుంబం తనిష్క్ సంస్థ ఆభరణాలు వేసేలా ప్రకటన ఉంది. ఇది లవ్ జిహాద్‌ను ప్రోత్సహించేలా ఉందంటూ విమర్శలు తీవ్రమయ్యాయి. ప్రకటన వివాదాస్పదం అవడంతో ఈ ఆభరణాల సంస్థ స్పందించింది. ప్రకటన వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని, అందుకు తాము చింతిస్తున్నట్లు వివరించింది. తన ప్రకటనను ఉపసంహరించుకుంది.
హిందూ ముస్లిం గొడవలకు కారణమైన తనిష్క్ జ్యూవెలర్స్
Related tags :