హైకోర్టులో పంచాయితీ

నటి భావన లైంగిక వేధింపుల కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. మళయాళ మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌(అమ్మ) సభ్యులు.. నటీమణులు హనీ రోజ్‌, రచనా నారాయణకుట్టీలు కేరళ హైకోర్టులో ఓ పిటీషన్‌ దాఖలు చేశారు. నటి లైంగిక వేధింపులు కేసులో వాదనలు వినేందుకు మహిళా జడ్జిని నియమించాలని వాళ్లు పిటీషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటీషన్‌తోపాటు ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న హీరో దిలీప్‌ అభ్యర్థనను కూడా బెంచ్‌ శుక్రవారం విచారణకు స్వీకరించింది. (అక్కినేని అమల కఠిన నిర్ణయం)భావన వేధింపుల కేసును మహిళా జడ్జి పర్యవేక్షణలోనే విచారణ చేయిస్తామని కేరళ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంలో జాప్యం పైగా, ఆ మధ్య దిలీప్‌పై నిషేధం ఎత్తేస్తూ అమ్మ నిర్ణయం తీసుకోవటం ‘వుమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌’లోని నటీమణులకు ఆగ్రహావేశాలను రగిల్చింది. ఈ నేపథ్యంలోనే నటి లైంగిక వేధింపుల కేసులో ఇద్దరు హీరోయిన్లు పిటీషన్‌ దాఖలు చేయటం విశేషం. ‘మహిళా జడ్జి ఉంటేనే ఈ కేసులో విచారణ పారదర్శకంగా జరుగుతుందని, సత్వర న్యాయం కూడా జరగుతుందని భావిస్తున్నాం’ అని సదరు హీరోయిన్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. 2017 ఫిబ్రవరిలో ఓ చిత్ర షూటింగ్‌ కోసం వెళ్తున్న ఆమెను అపహరించిన కొందరు దుండగులు.. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వీడియోలు తీశారు. అనంతరం ఈ కేసులో అగ్రహీరో దిలీప్‌ హస్తం ఉందంటూ ప్రధాన నిందితుడు పల్సర్‌ సునీ పేర్కొనటం.. దిలీప్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయటం వెనువెంటనే జరిగిపోయాయి. ఎనిమిది నెలల తర్వాత బెయిల్‌పై దిలీప్‌ బయటకు రాగా.. ప్రస్తుతం కోర్టులో ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com