ద్విచక్రాలకు జీపీఎస్

భారత్‌లోని సవాళ్లు, అవకాశాలకు అనుగుణంగా ‘గూగుల్‌ మ్యాప్స్‌’లో ప్రత్యేక అంశాలను తీసుకురానున్నట్లు గూగుల్‌ సంస్థ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. ‘‘ఒక చోటు నుంచి ఇంకో చోటుకు మార్గనిర్దేశానికే గూగుల్‌ మ్యాప్‌లు పరిమితం కావు. ప్రత్యేకంగా భారత్‌ కోసం కొన్ని వెసులుబాట్లు రూపొందిస్తున్నాం. ఇక్కడి సవాళ్లును అవి అధిగమిస్తాయి. గూగుల్‌ మ్యాప్‌లను మరింత సమగ్రంగా, కచ్చితత్వంగా, విశ్వసనీయంగా తీర్చిదిద్దడమే దీని ఉద్దేశం’’ అని సంస్థ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ అనల్‌ ఘోష్‌ తెలిపారు.గూగుల్‌ మ్యాప్స్‌కు సంబంధించిన ద్విచక్ర వాహన మోడ్‌ను భారత్‌లోనే తొలుత ప్రవేశపెడుతున్నారు. దేశంలోని రిజిస్టర్డ్‌ వాహనాల్లో 70 శాతం వాటా వీటిదే కావడం ఇందుకు కారణం. కార్లు, బస్సులు, ట్రక్కులు ప్రయాణించలేని దగ్గర దారులను ఈ మోడ్‌లో చూడొచ్చు.ఒక్కో వ్యక్తికి ప్రత్యేకమైన ట్రాఫిక్‌, ఆగమన సమయ అంచనాలనూ ఇది అందిస్తుంది.రైళ్లు, బస్సు, మెట్రో సమాచారాన్ని అందిస్తుంది. 12వేల రైళ్ల షెడ్యూళ్లను తెలియజేస్తుంది.దేశంలోని వివిధ నగరాల్లో ప్రజా మరుగుదొడ్ల వివరాలను తెలియజేసేందుకు కేంద్ర పట్టణ, గృహ నిర్మాణ శాఖతో గూగుల్‌ పనిచేస్తోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com