లక్ష కోట్ల సంపద కలిగిన ఏకైక సంస్థ

లక్ష కోట్ల డాలర్ల కు చేరిన ఆపిల్.
ఐఫోన్‌ను సృష్టించిన యాపిల్‌ అమెరికా స్టాక్‌ మార్కెట్లో చరిత్ర సృష్టించింది. తొలిసారిగా 1 ట్రిలియన్‌ (లక్ష కోట్ల) డాలర్ల (సుమారు రూ.68 లక్షల కోట్లు) మార్కెట్‌ విలువ సాధించిన తొలి కంపెనీగా గుర్తింపు సాధించింది. గురువారం నాస్‌డాక్‌లో, ట్రేడింగ్‌ ప్రారంభంలోనే యాపిల్‌ షేర్‌ 207.05 డాలర్ల ధరను తాకింది. దీంతో 1 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను ఆ సంస్థ సాధించినట్లు అయింది.
* ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి యాపిల్‌ రూ. 78,000 కోట్ల (11.5 బిలియన్‌ డాలర్లు) నికర లాభాన్ని ప్రకటించింది. దీంతో స్టాక్‌మార్కెట్లో యాపిల్‌ షేర్లపై మదుపరులకు ఆసక్తి పెరిగింది.
* 1980లో ఈ సంస్థ పబ్లిక్‌ ఇష్యూకు వచ్చింది. అప్పటి నుంచి యాపిల్‌ షేర్‌ ధర 50,000 శాతం పెరిగింది. ఈ నాలుగు దశాబ్దాల్లో ‘ఎస్‌అండ్‌పీ 500’ నమోదు చేసిన వృద్ధి 2,000 శాతం మాత్రమే. దీంతో పోల్చితే యాపిల్‌ షేర్‌ మదుపరులకు అద్భుతమైన లాభాలు అందించినట్లు స్పష్టమవుతోంది.
* వాస్తవానికి అమెరికాలో ఈ ప్రత్యేకతను ముందుగా అమెజాన్‌ సాధిస్తుందని అనుకున్నారు. కానీ ఆ సంస్థ 879 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ దగ్గరే ఆగిపోయి రెండో స్థానంలో ఉంది.
* యాపిల్‌ వ్యవస్థాపకుల్లో స్టీవ్‌ జాబ్స్‌ ఒకరు. 1976లో ఆయన గ్యారేజీలో యాపిల్‌ సంస్థ ప్రాణం పోసుకుంది. అప్పటి నుంచి అద్భుతమైన సాంకేతిక నైపుణ్యంతో వినూత్న ఉత్పత్తులు అందిస్తూ, విభిన్నమైన మార్కెట్‌ వ్యూహాలతో పర్సనల్‌ కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్ల మార్కెట్‌ను శాసించే స్థాయికి ఎదిగింది.
* పర్సనల్‌ కంప్యూటర్ల తయారీతో యాపిల్‌ ప్రస్థానం మొదలైంది. ‘ఐఫోన్‌’తో మొబైల్‌ ఫోన్ల మార్కెట్లో అడుగుపెట్టాక, సంస్థ ప్రగతి అనూహ్య వేగాన్ని అందుకుంది. 2007లో సంస్థ ఐఫోన్‌ను ఆవిష్కరించింది. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా ఈ కంపెనీ విస్తరించింది.
* ఐఫోన్‌ను విడుదల చేయక ముందు 2006లో యాపిల్‌ అమ్మకాల ఆదాయం 20 బిలియన్‌ డాలర్లు కాగా, నికరలాభం 2 బిలియన్‌ డాలర్లు మాత్రమే. ఇప్పుడు ఒక త్రైమాసికంలోనే 11 బిలియన్‌ డాలర్లకు పైగా నికరలాభాన్ని ఆర్జించే స్థాయికి పెరిగింది.
* అమెరికాలో అత్యధిక మార్కెట్‌ విలువను సాధించడమే కాక, ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన బ్రాండ్‌ కూడా ‘యాపిల్‌’ కావడం ప్రత్యేకత.
* ఏ కంపెనీకి లేనంత అత్యధిక లాభాలు యాపిల్‌కు ఉన్నాయి.
* తమ వ్యాపార అవసరాలకు తగినంత సొమ్ములేక ఎన్నో కంపెనీలు ఇబ్బందులు పడుతూ ఉంటాయి. కానీ యాపిల్‌ సమస్యే వేరు. దీనికి ఎంత ఖర్చు చేసినా తరగనంత నగదు నిల్వలు ఉన్నాయి. యాపిల్‌ వద్ద 178 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.12,10,400 కోట్లు) నగదు ఉంది. ఈ సొమ్ముతో అమెరికాలో ప్రతి కార్ల కంపెనీని కొనుగోలు చేయవచ్చు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com