NRI-NRT

కాలుష్యానికి ఇండియానే కారణం

కాలుష్యానికి ఇండియానే కారణం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి భారత్‌పై నోరుపారేసుకున్నారు. భారత్‌ను చైనా, రష్యాలతో చేర్చి.. వాయు కాలుష్యం పెరుగుదలకు ప్రపంచ వ్యాప్తంగా ఈ దేశాలే కారణమవుతున్నాయంటూ ఆరోపించారు. తమ దేశం ఈ విషయంలో చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందంటూ అమెరికా అధ్యక్షుడు ప్రగల్భాలు పలికారు. గతంలో కూడా ట్రంప్‌ పలుమార్లు ఈ విధమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.