సచిన్ అకాడమీ ప్రారంభం

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ ఇక క్రికెట్ పాఠాలు వినిపించనున్నాడు. నార్త్‌వుడ్‌లోని మర్చంట్‌ టైలర్స్‌ పాఠశాలలో మిడిలెక్స్‌ క్రికెట్‌తో కలిసి సచిన్‌ అకాడమీని ఈ రోజు ప్రారంభించాడు. ఈ అకాడమీ పేరు తెందుల్కర్‌ మిడిలెక్స్‌ గ్లోబల్‌ అకాడమీ(టీఎమ్‌జీఏ). ఈ నెల 9 వరకు సచిన్‌ అక్కడే ఉండి 9నుంచి 14 సంవత్సరాల మధ్య యువతీ యువకులకు క్రికెట్‌ పాఠాలు చెప్పనున్నాడు. ఈ అకాడమీ గురించి సచిన్‌ గతంలో తన ట్విటర్‌ ద్వారా వివరాలు వెల్లడించాడు. త్వరలో ముంబయి, లండన్‌లో కూడా ఈ అకాడమీలు ప్రారంభించనున్నారు. దేశ వ్యాప్తంగా పలు క్యాంపులు కూడా నిర్వహించనున్నారు. ఆగస్టు 6న తొలి అకాడమీని మర్చంట్‌ టైలర్స్‌ పాఠశాలలో ప్రారంభిస్తున్నట్లు చెప్పిన సచిన్‌ ఈ రోజు అక్కడ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అనంతరం పిల్లలతో స్వయంగా మాట్లాడాడు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అకాడమీ నిర్వాహకులు సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com