ప్రేమ అంటే ఏమిటి
పార్క్లో గంటలు గంటలు ప్రియరాలు లేక
ప్రియుడి కోసం ఎదురు చూడటమా….?
లేక నువ్వు ఇష్టం లేదా అన్న అమ్మాయి
మీద యాసిడ్ పోయాడమా…?
లేక ఇష్టం లేదు అన్న అబ్బాయి మీద ఏదో
ఒకటి చెప్పి పోలీస్ కేస్ పెట్టాలి చనిపోతే
అని చెప్పి బెదిరించి ప్రేమించేలా
చేసుకోవాడమా….?
లేక డబ్బులు ఉన్న వాడిని ప్రేమించడమా లేక
అందమైన అమ్మాయిని ప్రేమించడమా….?
అసలు నిజమైన ప్రేమ అంటే ఏమిటి…?
వీడికి చాలా డబ్బు ఉంది. నన్ను సుఖంగా
చూసుకుంటాడు అని చేసేదా…?
దీని బాబుకి చాలా అస్థి ఉంది దీన్ని లైన్లో
పెడితే చాలు ఇక లైఫ్ హ్యాపీగా ఉంటది అని
చేసేదా…?
ప్రేమ అంటే ఏమిటి ఒకే కులం వాడు అదే కులం
వాళ్ళను ఇష్టపడతామా…?
సరే తెలిసింది చెప్పుతాను.
ప్రేమంటే ఖరీదైన బహుమతులు కాదు.
అందం అంతకన్నా కాదు
మరి ఏంటి అంటారా…?
మార్నింగ్ లేచి కొడుకు, కూతురు స్కూల్ కి
కాలేజి కి వెళ్ళాలి బాగా చదువుకోవాలి అని
ఇంట్లో ఎవరూ లేవక ముందు మన కోసం లేచి
అన్ని పనులు చేస్తుంది చూడండి అమ్మ అది
ప్రేమ
స్కూల్ లో ఏమన్నారో కాలేజీ లో ఏమన్నారో
ఇంకా ఫీజ్ కట్టలేదు తొందరగా కట్టాలి నా
కొడుకు ,కూతురు బాగా చదువుకోవాలి అని
ఆత్రత ఉంటుంది చూడండి నాన్నకి అది
ప్రేమ
స్వేచ్ఛమైన ప్రేమ
ఈ తినడానికి ఉన్న లేకపోయినా తనకి
వచ్చే సంపాదన సరిపోకపోయిన పెద్ద
చదువులు
చదివించాలి అనుకుంటారు తల్లిదండ్రులు
వాళ్ళని మనం ప్రేమించం ఎందుకంటే వాళ్ళని
మనం ఏమి అన్నా సరే వాళ్ళు మనల్ని
ప్రేమిస్తూనే
ఉంటారు వదులుకోలేరు ఆ నమ్మకంతో
మనం వాళ్ళని పట్టించుకొము
అదే ప్రేమని అయితే ఏం అనుకుంటాడో
ఏంటో ఎవడు లైన్ వేస్తున్నాడో ఏంటో అని ప్రతి
క్షణం భయం నా లవర్ ఎవడికి పడిపోతుందో
అన్న భయంతో ప్రేమిస్తుంటారు.
ఎప్పుడు ఎలా ఉంటారో తెలియని మనుసులు
కోసం ఎప్పుడు మనతో వుండి మన గురించి
ఆలోచించే తల్లిదండ్రులునే దూరం చేసుకోకండి.
చివరిగా ఒక్క మాట ప్రేమికులు రోజునాడు
మనకు ప్రియరాలు, ప్రియుడు లేకపోయినా
పరవాలేదు కానీ mothers day ,farthers day
రోజు అమ్మ నాన్నా లేక పోతే ఎలా ఉంటుందో
ఒక్క క్షణం ఆలోచించండి ఆ బాధ మాటల్లో
చెప్పలోమ్ కదా…?
కన్నావాళ్ళను ప్రేమించే ప్రతి ఒక్కరికి ఈ స్టోరీ
అంకితం.