చైనాలోని మోహే నగరం అద్భుతాన్ని వీక్షించింది. ఆకాశంలో ఒకేసారి ముగ్గురు సూర్యులు కనిపించడంతో ప్రజలు వింతగా తిలకించారు. ఉదయం 6.30 గంటల నుంచి 9.30 గంటల వరకూ ఈ అద్భుతం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అసలు సూర్యుడికి ఇరువైపులా ప్రతిబింబాల్లా కనిపించే సూర్యులను ‘ఫాంటమ్ సన్స్’ లేదా ‘సన్ డాగ్స్’గా పిలుస్తారు. సిర్రస్ మేఘాల్లోని మంచు స్ఫటికాలగుండా సూర్యరశ్మి ప్రయాణించినప్పుడు సూర్యుడికి పక్కనే ఇలా మరిన్ని సూర్యులు ఉన్నట్లుగా ఏర్పడుతుందని పరిశోధకులు వివరించారు. ఇలా కనిపించడం ఇదే తొలిసారి కాదు.ఈ ఏడాది ఫిబ్రవరిలో మంగోలియాలోనూ ఒకేసారి ఐదు సూర్యులు ఉన్నట్లుగా కనిపించింది. రష్యాలోని చెలయాబిన్స్క్లో 2015లో ముగ్గురు సూర్యుల ఉదయం కనువిందు చేసింది.
చైనాలో ముగ్గురు సూర్యులు
Related tags :