భారీ వర్షాలకు ఉల్లి ఘాటెక్కింది. కర్నూలు మార్కెట్ యార్డులో రికార్డు స్థాయిలో ఉల్లి ధర పలికింది.
క్వింటాల్ ఉల్లి రూ.4,850 ధర పలికింది. ఈ సీజన్లో ఇదే అధిక ధరగా చెబుతున్నారు.
రానున్న రోజుల్లో క్వింటా రూ.10 వేలు పలికే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
భారీ వర్షాలు, వరదలతో అధిక స్థాయిలో ఉల్లి పంట దెబ్బతింది.
దీంతో మార్కెట్ యార్డుకు గననీయంగా ఉల్లి దిగుబడులు తగ్గాయి.
పది రోజుల క్రితం వరకు కేజీ రూ.30 కంటే తక్కువగానే ఉండగా నేడు రూ.100కి చేరింది. నాణ్యత కొంచెం తక్కువగా ఉన్న ఉల్లిపాయలను కేజీ రూ.85కి పైగా విక్రయిస్తున్నారు. రైతుబజార్లలోనూ ఇదే రేటు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.