ఢిల్లీలో యాచించడం నేరం కాదు

దేశరాజధాని దిల్లీ నగరంలో యాచించడం నేరం కాదని దిల్లీ హైకోర్టు పేర్కొంది. యాచించిన వారిపై జరిమానాలు విధించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. నగరంలోని పరిస్థితులను, ఆర్థిక, సామాజిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి బలవంతంగా పిల్లలను అడుక్కునేలా చేస్తున్న ముఠాలను అరికట్టేందుకు దిల్లీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చట్టం తీసుకురావాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గీతా మిత్తల్‌, జస్టిస్‌ సి.హరి శంకర్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం ప్రజలకు సరైన ఆహారం, ఉద్యోగాలు కల్పించలేనప్పుడు యాచించడాన్ని ఎలా నేరంగా గుర్తిస్తుందని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. గతంలో ఈ కేసు విచారణలో కోర్టు ఈ విధంగా ప్రశ్నించింది. బాంబే ప్రివెన్షన్‌ ఆఫ్ బెగ్గింగ్‌ యాక్ట్‌ ప్రకారం అడుక్కోవడం నేరం. దీన్ని సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించారు. అయితే పేదరికం కారణంగా యాచించడం నేరం కాదని ప్రభుత్వం కూడా గతంలోనే వెల్లడించింది. యాచించడాన్ని నేరాన్ని పరిగణించడానికి బదులుగా రాజధానిలో యాచకులకు కనీస ప్రాథమిక హక్కులు కల్పించాలని దాఖలైన పిటిషన్లపై దిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. అలాగే నగరంలోని యాచకులకు కనీస అవసరాలైన ఆహారం, వైద్య సదుపాయాలు కల్పించాలని పిటిషన్‌లో కోరారు. ప్రస్తుతానికి అడుక్కోవడంపై కేంద్ర చట్టం ఏమీ లేదు. అయితే చాలా రాష్ట్రాలు బాంబే చట్టాన్నే పరిగణలోకి తీసుకుంటున్నాయి. యాచించడాన్ని నేరంగా పరిగణిస్తూ తమ చట్టాల్లోనూ మార్పులు చేస్తున్నాయి. ఈ చట్టం ప్రకారం మొదటి సారి యాచిస్తూ పట్టుబడితే మూడేళ్ల కంటే ఎక్కువ శిక్ష ఉంటుంది. మళ్లీ మళ్లీ అలాగే చేస్తే పదేళ్ల దాకా శిక్ష పడే అవకాశం ఉంది.
Begging is not a crime in Delhi-TNILIVE National News

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com