దణ్ణం తల్లీ

ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఎన్టీఆర్‌ బయోపిక్‌ ‘ఎన్టీఆర్‌’లో శ్రీదేవి పాత్రలో రకుల్‌ప్రీత్‌ సింగ్ నటించనున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ పాత్ర కోసం దర్శక, నిర్మాతలు ముందుగా కంగనా రనౌత్‌, సోనాక్షి సిన్హా, శ్రద్ధా కపూర్‌ల‌ను సంప్రదించినట్లు కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రచారం గురించి చిత్ర నిర్మాతల్లో ఒకరైన విష్ణు ఇందూరి‌ స్పష్టత ఇచ్చారట. ఈ మేరకు ఓ ఆంగ్లపత్రికతో ఆయన మాట్లాడినట్లు తెలుస్తోంది. ‘మేం సోనాక్షి, కంగన, శ్రద్ధలను కలవలేదు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ మా మొదటి ఎంపిక. ఆమెకు దక్షిణాదిలో చాలా పాపులారిటీ ఉంది. ప్రత్యేకించి తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. ఇప్పటికే ‘ఎన్టీఆర్‌’ సినిమా షూటింగ్‌ 30 శాతం పూర్తయింది. విద్యా బాలన్‌ ఆరు రోజుల షూటింగ్‌ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం రకుల్‌ డేట్స్‌ తీసుకునే పనిలో ఉన్నాం’ అని ఆయన చెప్పినట్లు రాశారు. రకుల్‌ కూడా శ్రీదేవి పాత్రలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారని ఆమె ప్రతినిధి అన్నట్లు తెలిసింది. ‘శ్రీదేవికి రకుల్‌ పెద్ద అభిమాని. కాబట్టి, ఈ పాత్రను ఇష్టపడి చేస్తున్నారు. కానీ, ఇంకా ఈ సినిమా పూర్తి వివరాలు ఆమె తెలుసుకోలేదు. ప్రస్తుతం ఆమె నాలుగు సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. మరోపక్క ఈ బయోపిక్‌కు డేట్స్‌ను కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని పేర్కొన్నట్లు తెలిసింది. ‘ఎన్టీఆర్‌’లో బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌, నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Rakul as Sridevi-TNILIVE Movies

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com