DailyDose

ఏపీలో పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం-నేరవార్తలు

ఏపీలో పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం-నేరవార్తలు

* పేద ప్రజలకు ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తోన్న లారీని మంగళగిరి మండలం కాజ టోల్ ప్లాజా వద్ద స్పెషల్ బ్రాంచి పోలీసులు పట్టుకున్నారు. సత్తెనపల్లి నుంచి ఛత్తీస్ ఘడ్ కు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు జిల్లా అర్భన్ ఎస్పీ అమ్మిరెడ్డికి పక్కా సమాచారం అందింది. స్పెషల్ బ్రాంచ్ పోలీసులను రంగంలోకి దించి కాజ టోల్ ప్లాజా వద్ద సోమవారం తెల్లవారుజామున వాహన తనిఖీలు చేపట్టారు. ఈ నేపధ్యంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తోన్న లారీని పట్టుకున్నారు. డ్రైవర్, క్లీనర్ లను అదుపులోకి తీసుకుని మంగళగిరి రూరల్ స్టేషన్ కు తరలించారు.

* ప్రభుత్వ అనుమతులకు విరుద్దంగా కరోనా రాపిడ్ టెస్ట్ కిట్లను సప్లై చేస్తున్న ముఠా గుట్టు రట్టుఎటువంటి అనుభవం లేకుండా టెస్ట్ లు చేస్తూ కరోనా వ్యాప్తికి కారణమవుతున్న నిందితులను అదుపులోకి తీసుకున్న నూజివీడు పోలీసులువారి వద్ద నుండి 38 బాక్సుల లలో, 954 రాపిడ్ టెస్ట్ కిట్లు స్వాధీనం1) Potluri Rajendra s/o Bhumaiah, A/42,C/Vysya, Kavadi guda,Hyderabad, working as a Distributor in Kamini Diagnosis.2) Chinta Venkateswara Rao s/o Sambasiva Ro, A/42, C/Vysya,Tiruvuru bus stop center, Nuzvid town. 9848758123.3) Mallela Sudheer Kumar s/o Appa Rao, A/32, C/Meru chippala,Krishna buddi centre, Kothapeta, Nuzvid town.

* విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ అశోక్ పిల్లర్ సమీపంలో పెచ్చులు ఊడిపడ్డాయి. ఫ్లైఓవర్ కాంక్రిట్ పిచ్చిలు ఊడి పడటంతో కింద విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కి గాయాలు.

* నిరాధారమైన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు దమ్మపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

* ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ లోని పలు ఆలయాల్లో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నయి. దీనిలో తోడు గుప్త నిధుల కోసం ఆలయాన్ని ధ్వంసం చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా తర్లుపాడులో ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన పురాతన శ్రీ వీరభద్రస్వామి ఆలయాన్ని గుప్త నిధుల కోసం ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ జరిగిన ఘటనపై స్పందిస్తూ, స్థానిక సీఐలు ఆలయాన్ని సందర్శించారని తెలిపారు.ఆలయ గోపురంపై ఉన్న కలశానికి పసుపు, కుంకుమలతో పూజలు చేసి మరీ, చుట్టూ ఉన్న కాంక్రీట్ ను పగలగొట్టి, కలశాన్ని తొలగించారని ఆయన స్పష్టం చేశారు.గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారని, ఆలయ కలశాన్ని ప్రతిష్ఠించిన వేళ, అక్కడేమైనా నిధిని దాచివుంచవచ్చని భావించిన దుండగులు ఈ పనికి పాల్పడ్డారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్టు తెలిపారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

* సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో జలుమురి విజయ లక్ష్మీ (45) అనే వివాహిత హత్య.భార్యపై అనుమానంతో భర్త చిటిరాజు ఇంటి పనులు చేసికొని వెళ్తుండగా మార్గమద్యంలో గొంతు నులిపి చంపేసాడని బంధువులు ఆరోపిస్తున్నారు.గతంలో 2018 లో కూడా భార్య భర్తల ఘర్షణలో ఆమె మెడ పై కత్తితో దాడి చేసినట్టు సాలూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు ఐ ఉందని సాలూరు ci సింహాద్రి నాయుడు తెలిపారు.