లీచీ పండ్లు తింటున్నారా?

లిచి పండ్లలో  ప్రయోజనాలు

🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴

🍓 లిచి పండ్లు ప్రస్తుతం ఎక్కడ చూసినా కనిపిస్తుంటాయి. ఇవి ఎరుపు రంగులో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ పండ్లను చైనాలోనే ఎక్కువగా పండిస్తుంటారు. ఈ లిచి పండ్లను తీసుకోవడం వలన ఎలాంటి లాభాలున్నాయో తెలుసుకుందాం.

🍓 లిచి పండ్లను తీసుకోవడం వలన శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. తెల్ల రక్తకాణాల పనితీరును మెరుగుపరుస్తుంది. దీని వలన శరీరంలోని బ్యాక్టీరియాలు, వైరస్‌లు నాశనమవుతాయి. ఈ పండ్లలో ఉండే డైటరీ ఫైబర్ విరేచనం సాఫీగా జరిగేలా చేస్తుంది. ఈ లిచి పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉండడం వలన హైబీపీని అదుపులో ఉంచుతుంది.

🍓 రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. దీంతో గుండె పనితీరు సక్రమంగా ఉంటుంది. ఈ పండ్లలో ఉండే కాపర్, ఐరన్‌లు శరీరంలోని ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచుటలో సహాయపడుతాయి. శరీరంలో కణాలకు ఆక్సిజన్ అధికంగా లభించేలా చేస్తాయి. ముడతులు చర్మాన్ని తగ్గించుటలో లిచి పండ్లు ఎంతగానో దోహదపడుతాయి.

🍓 వీటిని తీసుకోవడం వలన విటమిన్ సి చర్మంపై ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీని ఫలితంగా చర్మం యవ్వనంగా ఉంటుంది. ముడతలు రాకుండా ఉంటాయి. ఈ పండ్లలో మెగ్నిషియం, కాపర్, పాస్పరస్, ఐరన్, మాంగనీస్ వంటి పోషకాలు ఎముకల బలానికి దృఢత్వాన్నిస్తాయి. ఈ లిచి పండ్లలో ఫైబర్ కొవ్వును కరిగించే శక్తి ఉంది.

Lychee filled with health-TNILIVE Health

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com