నాగులకు పూజలెప్పుడు?-ఆధ్యాత్మిక వార్తలు

౧. స్థానిక సంప్రదాయాలు, ఆచారాల్లో ఉండే భేదాల కారణంగా కొందరు శ్రావణంలో, మరికొందరు కార్తీకమాసంలో సర్పారాధన చేస్తారు. కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితిగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. కాగా, శ్రావణమాసంలో వచ్చే శుక్ల పంచమిని నాగపంచమిగా జరుపకుంటారు. కొన్నిచోట్ల శ్రావణ శుద్ధ చతుర్థి రోజున అంటే చవితి నుంచే నాగ పంచమి పూజకు సంబంధించిన విధానం మొదలుపెట్టాలని మరుసటి రోజు వరకు కొనసాగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టే కొన్ని ప్రాంతాల్లో దీన్ని నాగుల చవితి అని కూడా పిలుస్తారుశ్రావణమాసం శుక్ల పంచమిని నాగపంచమి అంటారు. స్కంద పురాణంలో ఇందుకు సంబంధించిన విషయాలు విస్తారంగా ఉన్నాయి. పార్వతీదేవికి సాక్షాత్తు పరమేశ్వరుడు నాగపంచమి వైశిష్ట్యాన్ని వివరించినట్లు ఇందులో ఉంది. ఆదిశేషుడు తనకు చేసిన సేవకు మెచ్చిన శ్రీమహావిష్ణువు అతడిని ఏదైనా వరం కోరుకొమ్మని అడిగితే, తాము (సర్పజాతి) ఆవిర్భవించిన రోజున సృష్టిలోని మానవులంతా తమకు పూజ చేసేలా అనుగ్రహించమని అడిగాడు. విష్ణుమూర్తి అనుగ్రహించాడు. ఈ వరం కారణంగా శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా జరుపుకునే ఆచారం వ్యాప్తిలోకి వచ్చింది. బ్రహ్మదేవుడు ఆదిశేషుడిని అ
నుగ్రహించిన రోజు కూడా ఇదేనని కొన్ని చోట్ల ఉంది.

2.ఆకులు, వక్కలు… ఆనవాయితీలు
తాంబూల సమర్పణం, సేవనం అనేది ప్రాచీన కాలం నుంచీ భారతీయుల జీవన విధానంలో భాగమైన సంప్రదాయం. పురాణాలు, రామాయణ, భారతాలతో పాటు ‘చరక సంహిత’, శ్రీనాథ మహాకవి రచనల్లోనూ తాంబూల ప్రస్తావన ఉంది. అసలు తాంబూలం ఎందుకివ్వాలి? ఎవరికివ్వాలి? ఎలా ఇవ్వాలి?
* తాంబూలంలో ప్రధానమైనది ‘తమలపాకు’. దీనికి సంస్కృతంలో ‘నాగవల్లి’ అని పేరు. క్షీరసాగర సమయంలో జనించి, స్వర్గానికి చేరి అక్కడి నుంచి భూమిపైకి వచ్చినట్లుగా కథనం. స్వర్గానికి ‘నాకం’ అని పేరు. నాకం నుంచి పుట్టింది కనుక ‘నాకవల్లీ’ అయి తర్వాత ‘నాగవల్లీ’గా మార్పు చెందింది అంటారు.
దేవుడికి చేసే షోడశోపచార పూజల్లో తాంబూల సమర్పణ ఒకటి.
* ‘‘ఫూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతామ్‌’’ అని భగవంతుడికి తాంబూలం సమర్పించాలి. భగవంతుడికి నివేదన తర్వాత తాంబూలం సమర్పించాలి.
* భగవంతుడికి తాంబూలంలో కనీసం మూడు ఆకులు, రెండు వక్కలు, పచ్చ కర్పూరం, ముత్యపుపొడి లేదా సున్నం ఉంచి సమర్పించాలి. తమలపాకులు, వక్కలు, సున్నంతో పాటు యాలకులు, జాజికాయ, జాపత్రి, కస్తూరి, కుంకుమపువ్వు, పుదీనా, కొబ్బరి తురుము కూడా కలుపుతున్నారు. ఇవన్నీ తర్వాత్తర్వాత వచ్చిన సంప్రదాయాలు. అతిథులను దైవస్వరూపులుగా చూసే సంప్రదాయం మనది కాబట్టి వారికి కూడా ఇదే విధంగా తాంబూలం ఇవ్వాలి.
* పూర్వం ఒప్పందాలు కుదిరిన సమయంలో ఇరుపక్షాలు తాంబూలాలు మార్చుకునేవారు. యుద్ధానికి వెళ్లే ముందు సైనికాధికారులకు తాంబూలం ఇచ్చి పంపేవారు. ఇప్పటికీ వివాహాలు కుదిరిన సమయంలో నిశ్చయ తాంబూలాలు మార్చుకోవడం చూస్తుంటాం.
* వస్త్రాలు ఎవరికైనా పెట్టే సమయంలో తప్పనిసరిగా తాంబూలం ఉంచాలి.
* తాంబూలం వేసుకున్న సమయంలో మొదటగా వచ్చే రసం విషతుల్యం అనీ, రెండోది విరేచనకారి అనీ, మూడోది అమృత తుల్యమని ఆయుర్వేదం వెల్లడిస్తోంది. కనుక మొదటి రెండు మింగరాదు. మూడోది మింగాలంటారు.
* తాంబూల సేవనం జీర్ణక్రియను మెరుగుపర్చడంతో పాటు నోరు, దంతాలు, నాసిక, కంఠం, నేత్ర సంబంధ వ్యాధులు రాకుండా చూడడంతో పాటు ఎముకలు, గట్టిపడేందుకు దోహదం చేస్తుంది.
* వివిధ దేవుళ్లకు ఆకులతో పూజలు చేసినా.. శ్రీఆంజనేయుడికి తమలపాకులతో పూజ అత్యంత ప్రీతికరమైనది.

3.ఆ అయిదూ..?
కోరికలు తీరడానికి, తలచిన కార్యం నెరవేరడానికి, లోకకల్యాణార్థం చేసే మహత్కార్యాన్ని యజ్ఞం అంటారు. యజ్ఞం ఐదు రకాలని చెబుతోంది వేదం.
*దైవ యజ్ఞం: దేవతల తృప్తి కోసం అగ్నిహోత్రంలో హవిస్సులు (హోమద్రవ్యాలు) వేసి హోమం చేస్తారు.
*పితృ యజ్ఞం: మరణించిన పెద్దలకు తర్పణాదులు ఇచ్చి వారి ప్రీత్యర్థం ప్రాణులకు ఆహారం అందివ్వడం.
*భూత యజ్ఞం: ఇంటిలో నిత్యపూజ తర్వాత బహిరంగ ప్రదేశంలో ప్రాణుల కోసం ఆహారాన్ని ఉంచడం.
*మనుష్య యజ్ఞం: శక్తి కొద్దీ అతిథులకు అన్నం పెట్టడం.
*బ్రహ్మ యజ్ఞం: వేదాలలో కొంత భాగాన్ని శక్తి కొద్దీ నిత్యాభ్యాసం చేయడం.
Nagula Panchami 2018-TNILIVE Devotional

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com