సాహసమే నా కోరిక

నా మనసు సాహసాల్నే కోరుకుంటోందని చెబుతోంది కాజల్‌. పుష్కర కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న ఈమె ప్రస్తుతం కొత్త భామలకి దీటుగా అవకాశాల్ని అంది పుచ్చుకొంటోంది.‘దర్శకులు నా కోసం పాత్రల్ని సృష్టిస్తున్నంత కాలం చిత్రసీమలో కొనసాగుతాన’ని చెబుతోంది కాజల్‌. కెరీర్‌ తొలి రోజులతో పోలిస్తే కథల పరంగా మీ ఆలోచనల్లో మార్పులేమైనా వచ్చాయా? అని అడిగితే..చాలానే వచ్చాయంటూ ఇలా మనసు విప్పిందామె. ‘‘నటులు ఎవరికైనా ఓ మంచి పాత్ర ఇచ్చే తృప్తే వేరు. అయితే తొలినాళ్లలో పాత్రల గురించి ఎంత ఆలోచించేదాన్నో, బాక్సాఫీసు పరంగా ఫలితాల గురించీ అంతే ఆలోచించేదాన్ని. కానీ ఇప్పుడు ఆ తీరు మారింది. మంచి పాత్ర అనిపిస్తే… దానికోసం ఎన్ని సవాళ్లకైనా సిద్ధం కావాలనిపిస్తుంది. దాని ఫలితం గురించీ, ఇతరత్రా లెక్కల గురించి ఆలోచనలే రావు. ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే పాత్రలు చేయడంపైనే నా దృష్టంతా’’అని చెప్పింది కాజల్‌.
Kajal about her wishes-TNILIVE Movies

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com