మాయం అయిపోతున్నారు

దెయ్యాలు ఉన్నాయా? లేదా? ఇదో అంతుచిక్కని ప్రశ్న. మరి ఇదే ప్రశ్నని యువతరంలో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న బాలీవుడ్‌ భామ శ్రద్ధాకపూర్‌ని అడిగితే ఏమంటుంది? ఆమెనే ఎందుకు అడగాలి అంటే ఆమె ఓ హారర్‌ చిత్రంలో నటిస్తోంది. ఓ ఊరిలో పురుషులు మాయమైపోతుంటారు. కారణం ఓ ‘స్త్రీ’. అలాంటి హారర్‌ కథలో తొలిసారి నటిస్తోంది శ్రద్ధ. దెయ్యాలు…భూతాలున్నాయంటే మీరు నమ్ముతారా? అంటే ‘‘నాకు అదో ప్రశ్నగానే మిగిలిపోయింది. కానీ మనందరిపైనా ఓ గొప్ప శక్తి ఏదో ఉందని నమ్ముతాను. అలాంటప్పుడు ఆ శక్తికి ప్రతికూలమైన దుష్ట శక్తి కూడా ఉండే ఉండొచ్చేమో’’ అని చెప్పింది. స్త్రీ చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ సంఘటనను చెప్పింది శ్రద్ధ. ‘‘షూటింగ్‌ సమయంలో చాలా సంఘటనలు జరిగాయి. ఓ రోజు లైట్‌మ్యాన్‌ ఎత్తు నుంచి కిందకు పడిపోయాడు. ‘నన్ను ఎవరో కిందకు లాగేశారు’ అంటూ తర్వాత చెప్పాడు. అలాంటివి జరిగినప్పుడు ఆశ్చర్యం వేయకమానదు కదా’’అంటోంది శ్రద్ధ.
Shraddha Kapoor-TNILIVE Movies

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com