మిషిగన్ నుండి అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ముస్లిం మహిళ

అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా 42ఏళ్ల రషీదా తలైబ్‌ చరిత్ర సృష్టించనున్నారు. మిషిగన్‌లోని 13వ కాంగ్రెస్‌ డిస్ట్రిక్ట్‌లో డెమోక్రటిక్‌ పార్టీ నామినేషన్‌ను ఆమె గెలుచుకున్నారు. ఇక్కడి నుంచి ఈ సారి రిపబ్లికన్‌ అభ్యర్థులెవరూ బరిలోకి దిగడంలేదు. దీంతో నవంబరులో జరుగనున్న ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఆమె విజయం సాధించనున్నారు. రిపబ్లికన్‌ చట్టసభ సభ్యుడు జాన్‌ కాన్యెర్స్‌ జూనియర్‌ స్థానాన్ని ఆమె భర్తీ చేయనున్నారు. పాలస్తీనా సంతతికి చెందిన రషీద్‌.. బ్రెండా జోన్స్‌పై పోటీచేసి డెమోక్రటిక్‌ నామినేషన్‌ను గెలుచుకున్నారు. ఈమె 2009 నుంచి 2014లో మిషిగన్‌ రాష్ట్ర శాసనకర్తగా పనిచేశారు. ఆనాడు కూడా మిషిగన్‌ చట్టసభలో అడుగుపెట్టిన తొలి ముస్లిం మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా పనిచేశారు.
Rashida Talaib To American Congress-TNILIVE International Politics

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com