ఇండియా బుక్ ఎక్కిన ఆత్రేయపురం పూతరేకులు

ఆత్రేయపురం పూతరేకుకు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు దక్కింది. ఆత్రేయపురం పూతరేకుకు అంతర్జాతీయ ప్రాచుర్యం కల్పించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకశాఖ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. విజయవాడ బెరంపార్కులో గురువారం ఆత్రేయపురానికి చెందిన నిపుణుల సాయంతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ శ్రమించి 10 మీటర్ల పొడవైన పూతరేకును తయారు చేశారు. ఇప్పటి వరకూ దేశంలో ఇదే అతిపెద్ద పూతరేకుగా గుర్తించిన ఇండియా బుక్ ప్రతినిధులు.. నిర్వహకులకు ధ్రవీకరణపత్రం అందజేశారు. తాము తయారు చేసిన పది మీటర్ల పూతరేకు ఇండిబుక్‌ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించడం పట్ల ఆత్రేయపురం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Aaathreyapuram Poothrekulu New Record-TNILIVE Specials

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com