పండుగ చేసుకోండి

బీసీసీఐ ఆఫీస్‌ బేరర్లు ఇకపై వరుసగా రెండు సార్లు పదవులు చేపట్టవచ్చని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును బీసీసీఐ పాలకుల కమిటీ అధినేత వినోద్‌ రాయ్‌ స్వాగతించారు. బోర్డు ఎన్నికల్లో మార్గసూచీగా ఇది ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. లోధా కమిటీ అసలు సిఫార్సుల ప్రకారం ఒకసారి పదవీకాలం పూర్తికాగానే మూడేళ్లు విరామం (కూలింగ్‌ ఆఫ్ పిరియడ్‌) తప్పనిసరి. గురువారం సుప్రీం ఇచ్చిన ఆదేశాల ప్రకారం అభ్యర్థులు రెండు సార్లు వరుసగా పోటీ చేయవచ్చు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌తో కూలిన ధర్మాసనం గురువారం పై ఆదేశాలు జారీ చేసింది. ‘గౌరవ కోర్టు ఇచ్చిన ఆదేశం చాలా బాగుంది. ఆఫీస్‌ బేరర్లు రెండుసార్లు వరుసగా పనిచేసేందుకు నాకెలాంటి అభ్యంతరం లేదు. విరామం ముందు పదవీకాలం ఆరేళ్లుండాలని నేను ఇంతకు ముందే ప్రతిపాదించాను. అయితే ఏకాభిప్రాయం కుదరలేదు’ అని రాయ్‌ మీడియాకు తెలిపారు. బీసీసీఐ నూతన రాజ్యాంగం అమలుకు టైమ్‌లైన్‌ను ఏర్పాటు చేయడం సుప్రీం కోర్టు నుంచి వచ్చిన మరొక సానుకూల ఆదేశమని రాయ్‌ పేర్కొన్నారు. దీంతో ఎన్నికలకు మార్గం సుగమమైందని రాష్ట్ర సంఘాలు 100 శాతం రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిందేని అన్నారు. కొన్ని సంఘాలకు శాశ్వత సభ్యత్వం ఇచ్చినందుకు రాయ్‌ ఆనందం వ్యక్తం చేశారు. రైల్వేస్‌, సర్వీసెస్‌, యూనివర్సిటీస్‌కి సుప్రీం శాశ్వత సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించింది. ముంబయి, సౌరాష్ట్ర, వడోదర, విదర్భ సంఘాలకు ఓటు హక్కు కల్పించింది. ‘ముంబయి వంటి సంఘాలకు ఓటింగ్‌ సౌకర్యాన్ని కల్పించి వాటి వారసత్వానికి కొనసాగించాలని కోరుకుంటున్నాం. రాజ్యాంగ ముసాయిదా సైతం దీనిని ప్రతిపాదించింది. బీసీసీఐ ప్రతి అనుబంధ సంఘానికి ఓటింగ్‌ హక్కులుంటాయి. కోర్టు తీర్పు ప్రకారం సంఘాలన్నీ రాజ్యాంగాన్ని అమలు చేయాలి. లేదంటే పాలకుల సంఘం కోర్టుకు వెళ్తుంది’ అని రాయ్‌ తెలిపారు. సంస్కరణలను అమలు చేయాలని సుప్రీం కోర్టు తమను నియమించిందని తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు పాలకుల సంఘం సభ్యురాలు డయానా ఎడుల్జీ అన్నారు. సవరించిన ఉత్తర్వుల సక్రమంగా అమలయ్యేలా చూస్తామన్నారు. అన్ని సంఘాలు దీనిని అమలు చేస్తాయని ఆశిస్తున్నాని పేర్కొన్నారు. బీసీసీఐ అధికారులు, ఆఫీస్‌ బేరర్స్‌తో తమకెలాంటి వ్యక్తిగత వైరాలు లేవని ఎడుల్జీ అన్నారు.
BCCI Supreme Court-TNILIVE Sports

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com