బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో దుర్మార్గుల దోపిడీ-చోద్యం చూస్తున్న ప్రభుత్వం!

శ్రీదుర్గా మల్లేశ్వర స్వామీ వారల దేవస్థానంలో పలక వర్గం మితిమీరి జోక్యం చేసుకుంటుందన్న ఫిర్యాదులు ఉన్నాయి. విధాన నిర్ణయాలు రూపొందించక పోవడంతో పాటు ఆలయ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. దాతల నుంచి విరాళాలు అధికంగా వచ్చేలా చూడాల్సి ఉంటుంది. సామాన్య భక్తులకు ఎదురవుతున్న సమస్యలను తీర్చేందుకు సౌకర్యాల మెరుగుపరచాల్సి ఉంది. కానీ ప్రస్తుతం పాలక వర్గం అన్నీ తామే అన్నట్లు అధికారాలు చెలాయిస్తున్న సిబ్బంది పై పెత్తనం చేస్తోందన్న విమర్శలు మూటగట్టుకుంది. పాలకవర్గంలో పదహారు మంది సభ్యులుగా ఉన్నారు. వీరిలో ప్రధాన అర్చకులు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నారు. ఒక భాజపా సభ్యుడిగా తీసుకున్నారు. మిగిలిన పద్నాలుగు మంది అధికార పార్టీ తెలుగుదేశానికి చెందిన వ్యక్తులే.
**గతంలో ఈవోగా సూర్యకుమారి ఉన్న సమయంలో పాలకవర్గంలో ఆమెకు ఏ మాత్రం పొసగలేదు. పాలక వర్గానికి కనీసం ప్రోటోకాల్ కూడా లభించేది కాదు. కొండమీద రావద్దని ఖరాఖండీగా చెప్పారు. దీంతో పాలకవర్గం కేవలం సమావేశాలకే పరిమితమైంది.
**అర్ధరాత్రి పూజల వ్యవహారం పై వేసిన కమిటీ నివేదికలు ఇంతవరకు వెలుగు చూడలేదు. కనీ ఐఏఎస్ అధికారికి మళ్ళీ మంచి పోస్టింగ్ లభించింది.
*తర్వాత వచ్చిన ఈవో పద్మ పాలకవర్గానికి విలువ ఇచ్చారు. ప్రోటోకాల్ పాటించారు. దీంతో కొంతమంది సభ్యులు రెచ్చిపోయారు. అంతా తామే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
*పాలకవర్గం సభ్యులను కమితీలుగా వేశారు. చీరాల విభాగం, అన్నదానం విభాగం, వేలంపతల పర్యవేక్షణ కొనుగోలు కమిటీ ఇకా వేశారు. ఇక్కడ అధికారులు నామమాత్రంగా మరి సభ్యులే కర్యనిర్వహకులుగా అధికారం చేలయిస్తున్నారు. కమీషన్ల తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
*చీరాల మాయం కొత్త విషయం కాదని విజిలెన్స్ విచారణలోఇండి. గత ఈవో హయాంలోనే దాదాపు రూ. కోటి వరకు చీరలు మాయమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. చీరలను పర్యవేక్షించే బడయ్తలను సూర్యలతకు అప్పగించారు. ఆమె చీరను తీసుకెళ్లడం సీసీ టీవీ పుటేజీలో కనిపించింది. అయితే ఈచీరను భక్తులు తనకే సమర్పించారని ఆమె సెలవు ఇవ్వడం విశేషం. దుర్గగుడి నుంచి తస్కరించిన చీరలతోనే ఓ వ్యక్తీ వ్యాపారం చేస్తున్నట్లు పాలకవర్గ సభ్యులే చెబుతున్నారు.
*ఇటీవల దుర్గగుడిలో కొత్తగా సెక్యురిటీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఏంజెల్స్ అనే కొత్త సంస్థ టెండర్ దక్కించుకుంది. కానీ మరో సంస్థ రాపిడ్ యక్సహ్న్ ఫోర్సుకు ఇవ్వాలని స్వయంగా చైర్మన్ ఒత్తిడి చేయడం గమనార్హం. కనీ సగం ప్రోక్యుర్ మెంట్ ద్వారా పిలిచినా టెండర్ల లో ఏంజిల్స్ దక్కించుకుంది. కనీ సగం సగం ఇవ్వాలని చైర్మన్ తోపాటు కొంతమంది సభ్యులు ఒత్తిడి చేయడంతో రెండు నెలలు పెండింగ్ లో పడింది. ఎట్టకేలకే నిబందనల ప్రకారం ఈవో పద్మ వ్యవహరించి ఏంజిల్స్ కు అప్పగించారు.
*గతంలో సెక్యురిటీ లో ఉన్న యువతిని ఓ సభ్యుడు లొంగదీసుకున్నరనే ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగం శ్వశ్వతం చేయిస్తానని మాయమాటలు చెప్పినట్లు ప్రచారం జరిగింది. మరో యువతి [పై కూడా వల వేయడంతో ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో చైర్మన్ జోక్యం చేసుకుని ఆ సభ్యుడికి మచ్చ రాకుండా సంఘటన వెలుగు చూడకుండా సర్దుబాటు చేసారు.
*ప్రస్తుతం సీసీ టీవీలు నియంత్రించే ఉద్యోగి ఓ సభ్యురాలి బంధువు కావడం విశేషం. అదేవిధంగా రూ.కోటి విలువైన సీసీ టీవీల ఏర్పాటు టెండర్ ను ఆ సభ్యురాలు చక్రం తిప్పి తమవారికి దక్కేతట్లు చేసినట్లు తెలిసింది.
*బియ్యం, పచారీ సామాగ్రీ కొనుగోలులోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీనిలోని ఇతర కంట్రాక్టర్ లు రాకుండా చక్రం తిప్పుతున్నారు. దీనిలోనూ కమీషనర్లు ఎస్తున్నరనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఈ సామగ్రీ కొనుగోలు టెండర్ లేకుండానే అప్పగించడం విశేషం.
*కర్ణాటకకు చెందిన ఓ ఏజెన్సీ ద్వారా నెయ్యి కొనుగోలు చేయాలనీ పాలక వర్గం తీవ్ర ప్రయత్నాలు చేసింది. సభ్యుల్లో రెండు వర్గాలుగా ఏర్పడి రచ్చరచ్చ చేశారు. ఎట్టకేలకే ఈ ఏజెన్సీకి వద్దని తేల్చారు. స్వయంగా చైర్మన్ ఆ ఏజెన్సీకి ఇవ్వాలని పట్టుబట్టారు.
*క్షరకుల వివాదానికి ఓ సభ్యుడి దురుసు ప్రవర్తన కారణంగా చెబుతున్నారు. పాలకవర్గ సభ్యుడు ఓ క్షరకుడి చొక్కా పట్టుకుని దౌర్జన్యం చేయడంతో సిఎం వరకు పంచాయతీ వెళ్ళింది. ఎట్టకేలకు సిఎం దగ్గర సర్దుబాటు అయింది.
*ఇక దుర్గగుడి అభివృద్ధి కోసం జరుగుతున్నా పనుల్లోనూ వాటాలను వదలడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రూ.ఎనిమిది కోట్లతో నిర్మాణం చేపట్టిన దుర్గగుడి పెర్గోవా విషయంలోనూ వివాదం తలెత్తింది. పురావస్తు శాఖ అధికారులతో ఘర్షణ పడినట్లు తెలిసింది. ప్రస్తుతం ఇవి అసంపూర్తిగా ఆగిపోయాయి.
*దుర్గగుడిలో శివాలయం అభివృద్ధి ఘాట్ రోడ్డు నిర్మాణం తదితర రూ.ముప్పై కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. ఈఈ పర్యవేక్షణలో జరుగుతున్న వీటిలోనూ కమీషన్లు తీసుకుంటారన్న ఆరోపణలు ఉన్నాయి.
*ప్రముఖులు సందర్శనకు వచ్చిన సమయంలో ప్రచారం కోసం పలక వర్గం పాకులడుతూన్నారనే విమర్శలు ఉన్నాయి. కొంతమందికి లేని మర్యాద కల్పిస్తున్నరనే ఆరోపణలు ఉన్నాయి.
*ప్రముఖులు సందర్శనకు వచ్చిన సమయంలో ప్రచారం కోసం పాలకవర్గం పాకులడుతూన్నారనే విమర్శలు ఉన్నాయి. కొంతమందికి లేని మర్యాద కల్పిస్తున్నరనే ఆరోపణలు ఉన్నాయి.
*పలక వర్గం తీరే ఇలా ఉంటె.. ఇక అధికారులు వారిని ప్రసన్నం చేసుకోవడంలో మునిగిపోయారు. పాలకవర్గం బూచీని చూపెట్టి అధికారులు సైతం వసూళ్లు ప్రారంభించారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
*దుర్గగుడి ప్రక్షాళనకు చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. పలక వర్గాన్ని రద్దు చేయాలనే ఆలోచనలో ఉన్నా.. ఎన్నికల ముందు అనవసర వివాదం తలెత్తడం ఇష్టం లేక మౌనంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి.
*****విధులకు దూరంగా ఉండాలని సూచన
ఇంద్రకీలాద్రి పై మల్లిఖార్జున మహా మండపంలో సారే చీర అదృశ్యం వ్యవహారంలో ఆరోపణను ఎదుర్కొంటున్న పాలకమండలి సభ్యురాలు కె.సూర్యలతను విచారణ పూర్తయ్యేంత వరకు దుర్గగుడికి సంబందించిన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని చైర్మన్ గౌరంగాబాబు మంగళవారం లేఖ రాశారు. మల్లిఖార్జున మహా మండపంలోని దుర్గమ్మ ఉత్సవమూర్తికి కప్పిన సారే చీర తిరిగి కౌంటరుకు చేరని విషయం తెలిసి విచారణ చేయించాలని ఈనెల ఆరున పాలకమండలి చైర్మన్ కు దాతలు లిఖితపూర్వ కంగా ఫిర్యాదు చేశారు.
Durga Temple Issues-TNILIVE Spiritual

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com