తెలుగు జాతి సేవలో తానా-మొదటి భాగం-TNI ప్రత్యేకం

అమెరికాలో ఉన్న పలు తెలుగు సంఘాలు తెలుగు భాష, తెలుగు జాతికోసం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి. వీటిని పాటకులకు అందించడం కోసం TNI ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా తానా తెలుగుజాతికి చేస్తున్న సేవలకు సంబంధించి మొదటి భాగం ఇది. ఇక చదవండి.

**ఎప్పుడో దేశం విడిచిన ఇక్కడి గువ్వలన్ని తెలుగువాళ్ళమన్న గుర్తింపు వీడలేక గూటిని అల్లుకున్నాయి. ‘తానా’అంటే ఉత్తర అమెరికా తెలుగు సంఘానికి రెండక్షరాల సంక్షిప్త నామం. అంతర్జాతీయ యవనిక పై తెలుగు వెలుగు వికాసానికి సాక్షి సంతకం. స్థానిక సంస్థల కన్నా సమర్దవంతంగా నడుస్తూ ముప్పై అయిదేళ్ళ దిగ్విజయ పదాన్ని దాటి వచ్చింది. ఎన్నో సాంస్కృతిక సంశాలను ఎందఱో కళాకారులను ప్రోత్సహించింది. కార్యాచరణ పరిధిని అంతకంతకూ విస్తరించుకుంటూ తెలుగుతనానికి బలమైన కుడి భుజంగా ఎదుగుతూ వస్తోంది. ఆ కృషిలో భాగంగా తెలుగుభాష పరిరక్షణకు, పరిపుష్టికి విశిష్టమైన కృషి చేస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.

**అమెరికాలోని తెలుగువారు తగు సంఖ్యలో స్థిరపడటం మొదలుబెడుతున్న రోజుల్లో, అంటే 1970లలో చాలా నగరాల్లో తెలుగు సంఘాలను ఏర్పరచుకోవటం మొదలుబెట్టారు. అమెరికా అంతటా చెదురుమదురుగా ఉన్న సంఘాలన్నీ ఒకచోట చేర్చటానికి 1977లో న్యూయార్క్ నగరంలో డా.గుత్తికొండ రవీంద్రనాథ్, డా.కాకర్ల సుబ్బారావుల నాయకత్వంలో ఉత్తర అమెరికా తెలుగు మహాసభలు జరిగాయి. ఆ మహాసభలకు వచ్చిన తెలుగువారంతా అమెరికాలో తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతులను పరిరక్షించుకుని, వ్యాప్తి చేసేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘాన్ని (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరిక, సంక్షిప్తంగా TANA- తానా) ఏర్పాటు చేసుకున్నారు. అమెరికాలో తెలుగు భాష నేర్చుకోవటానికి వీలు కల్పించడం, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం, తెలుగు సాహిత్య వ్యాప్తికి సహకరించడం తానా ముఖ్య ఆశయాలు. సంస్థ ప్రారంభం నుంచి తానా ఈ ఆశయాలను సాధించడానికి నిరంతరంగా, బహుముఖాలుగా కృషి చేస్తూనే ఉంది.

**గిడుగు రామ్మూర్తి అవార్డు.
తెలుగు భాష అద్యయనం, అభ్యుదయం కోసం నిరంతరం కృషి చేస్తున్న వారిని గుర్తించి ప్రోత్సహించేందుకు తానా గిడుగు రామ్మూర్తి అవార్డుని నెలకొల్పింది. 2002 నుంచి ప్రతి రెండేళ్లకూ, తెలుగు భాష ప్రగతికి అంకితమైన ఒక వ్యక్తిని గిడుగు రామ్మూర్తి అవార్డు కింద యాభై వేల రూపాయల నగదులతో తానా సత్కరిస్తుంది. ఇప్పటి వరకు ఈ అవార్డును ఆచార్య చేకూరు రామారావు, భద్రీరాజు కృష్ణమూర్తి, సి.ధర్మారావు, స.వెం.రమేష్, ఎ.బీ.కే.ప్రసాద్, ఎస్వీ.సుబ్రహ్మణ్యంలు అందుకున్నారు.

**తెలుగుభాషా బోధన.
అమెరికాలో విశ్వవిద్యాలయ స్థాయిలో తెలుగు నేర్పటానికి, తెలుగుభాషలో పరిశోధనలు జరగటానికి అనువైన వాతావరణం కల్పించటానికి తానా కృషి చేస్తుంది. విస్కాన్సిన్ (మాడిషన్) విశ్వవిద్యాలయంలో తెలుగు క్లాసులు నడుస్తున్న రోజుల్లో, తెలుగు నేర్చుకుందామని ముందుకు వచ్చిన విద్యార్ధులకు తానా ఫౌండేషన్ ఉపకార వేతనాలు ఇచ్చేది. తర్వాత మిచిగాన్ (యాన్ అర్భన్) విశ్వవిద్యాలయంలో ఐదేళ్ళ పాటు తెలుగు నేర్పే అద్యాపకులుకు వేతనం ఇవ్వడానికి తానా నిధులు సమకూర్చింది. గత ఆరేళ్లుగా టెక్సాస్ విశ్వవిద్యాలయంలో తెలుగు తరగతులు నిర్వహించటానికి, అద్యాపకుల వెతనలకీ తానా నిధులు సమకూరుస్తూ ఉంది. ఏటా చాలా మంది విద్యార్ధులు ఇక్కడ తెలుగు నేర్చుకుంటున్నారు. వీరిలో భారత సంతతి వారే కాక, విభిన్న నేపద్యాల నుంచి వచ్చిన విద్యార్ధులు కూడా ఉన్నారు.

**ప్రాధమిక స్థాయిలో తెలుగు నేర్చుకునేవారి కోసం బాపు-రమణల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం తయారు చేసిన వీడియో పాటాలను, తానా 1990-93 మధ్యలో సభ్యులకు సరఫరా చేసింది. తానా పత్రికలో తెలుగు పాటాలు ప్రచురించడమే కాక, తెలుగు నేర్చుకోవడానికి బొమ్మల అక్షరాల పుస్తకాలను కూడా సభ్యులకు అందజేసింది. పిల్లల తెలుగు జ్ఞానాన్ని పెంపొందించడం కోసం 2003 నుంచి తెలుగు పద విజ్ఞాన పోటీలను వివిధ నగరాలలోనూ, ద్వైవార్షిక సమావేశాల్లోనూ తానా నిర్వహిస్తోంది. ప్రస్తుతం తెలుగు పాటాలు నేర్చుకోవడానికి వీలయ్యే వర్క్ బుక్స్ ను ప్రచురించటానికి చిన్నారుల్లో తెలుగుపై ఆసక్తి పెంచటానికి దోహదపడే పుస్తకాలను ప్రచురించటానికి తానా సన్నాహాలు చేస్తూంది.

**తానా సమావేశాల్లో సాహిత్య సభలు
తోలి రోజుల నుంచి తానా సమావేశాల్లో సాహిత్యాభిమానుల కొసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. 1980లో చికాగోలో జరిగిన మూడవ సమావేశానికి మహాకవి దాశరధి సి.నారాయణరెడ్డి. మల్లెమాల (ఏమ్మేసే రెడ్డి), త్రిపురనేని మహారధి వంటి కవులు, రచయితలు ప్రత్యెక అతిధులుగా రావటంతో సమావేశ ప్రారంభోత్సవం కవిసమ్మేళనంలా అనిపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది ప్రసిద్ద రచయితలూ, కవులు, పండితులు, విమర్శుకులు, ప్రచురణ కర్తలు, సాహితీ వెతలు, పాత్రీకేయులు తాన మహాసభల సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రముఖ రచయితా , పరిశోధకుడు, విమర్శకుడు, అనువాదకుడు, తెలుగు బోధకుడు ఆచార్య వెల్చేరు నారాయణరావును 2007లో తానా జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. 2011లో బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావును తానా ప్రత్యెక పురస్కారంతో గౌరవించింది.

**అవధాన హేల
1989లో తానా సమావేశాలకు ప్రత్యెక అతిధిగా వచ్చిన మేడసాని మోహన్ అష్టావదానాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను రంజింపజేశారు. అప్పటి నుంచి ప్రతి తానా సమావేశంలోనూ అవధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాను. మాడుగుల నాగఫణి శర్మ, గరికపాటి నరసింహారావు, రాళ్లబండి కవితాప్రసాద్, ఇతర అవధానులు విడివిడిగానూ కలివిడిగానూ తమ విద్యను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అవధానులతో పాటు, భువన విజయం ఆగతానికి స్వాగతం వంటి సాహిత్య రూపకాలు కూడా తానా సమావేశాలలో మంచి ప్రేక్షకాదరణ పొందాయి. 2001 తానా సమావేశాల్లో ప్రదర్శన కోసం ప్రత్యేకంగా ఇంద్రగంటి శ్రీకాంత సహ్ర్మ ఆగతానికి స్వాగతం అనే ప్రత్యెక సాహితీ చారిత్రాత్మక రూపకాన్ని రచించారు. 2009 సమావేశ ఆరంభ నృత్యం కోసం సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించిన సాంకేతిక వికాసం, సాంస్కృతిక విన్యాసం గేయ రూపకం అపూర్వమైన ప్రశంసలు పొందింది.

**తానా సభల్లో తెలుగు పుస్తకాలు
తానా మహాసభల సందర్భంగా ప్రత్యేకంగా తెలుగు పుస్తకాలు ప్రచురించిన, ఆవిష్కరించటం ఒక ఆనవాయితీ. 1991 అట్లాంటా సమావేశం సందర్భంగా ఆరుద్ర సమగ్రాంద్ర సాహిత్య చరిత్ర రెండో ప్రచురణ ఆవిష్కరించారు. 1993 లో న్యూయార్క్ సభల్లో ప్రచురించియా తానా తెలుగు కధనం (సంపాదకుడు-ఎ.ఎస్.మూర్తి), మంచుతునకలు (సంపాదకుడు-పెమ్మరాజు వేణుగోపాలరావు)కవితా సంకలనాలు చాలా ప్రశంసలు పొందాయి. అప్పుడే తానా ప్రత్యేకంగా ప్రచురించిన కాళీపట్నం రామరవు గారి యజ్ఞంతో తొమ్మిది కదా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం తానాకు గర్వకారణం.

*1995 చికాగో సమావేశంలో తానా బాపు-రమణల స్వర్ణోత్సవం జరిపిన సందర్భంలో వారిద్దరి మొదటి ప్రచురణలు గుర్తుగా బొమ్మా- బొరుసు అనే పుస్తకాన్ని ప్రత్యేకంగా ప్రచురించారు. ఆ సమేవ్శానికి కిలకోపన్యాసకుడుగా వచ్చిన కొంగర జగ్గయ్య తన గీతాంజలీ అనువాదాన్ని ఆవిష్కరిస్తే ఇంకో గౌరవ అతిధి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇదే సందర్భంలో భమిడిపాటి రామగోపాలం బాపురమణలకు నూటపదహార్లు అంటూ ప్రచురించిన సరదా కధలు, స్మైల్ ఖాళీ సీసాలు కదాసంకలనం, కే.సదాశివరావు క్రాస్ రోడ్స్ కధాసంకలనం ప్రచురించబడ్డాయి.

**తానా సమావేశాల జ్ఞాపికలు
1977 నుంచీ ప్రతి తానా అమవేహానికి తెలుగు పలుకు అన్న పేరుతొ ఒక సావేనీరును ప్రచురించటం సంప్రదాయం. సమావేశం వివరాలు అమెరికా ఆంధ్రుల రచనలు ఇండియా నుంచి తెప్పించుకున్న ప్రత్యెక రచనలతో సర్వంగా సుందరంగా తయారయ్యే ఈ ప్రత్యెక సంచికలు దాచుకోదగ్గవి. మొదట్లో ఈ సావేనీర్లను ఇండియాలో అచ్చు వేయించేవారు. తర్వాత ఇండియాలో కంపోజ్ చేయించి అమెరికాలోనే ప్రింట్ చేయించటం మొదలైంది. కొన్ని తానా సానేవీర్లు ప్రత్యేకంశాల మీద దృష్టిపెట్టి తగిన వ్యాసాలు వ్రాయించి సేకరించి సమీకరించటం వాళ్ళ (ఉదాహరణకు 1995, 2009 సావేనీర్ల లో ఆంధ్రుల చిత్రకళ పై వ్యాసాలు, చిత్రాలు) ఆ విషయాలపై ఆసక్తి ఉన్న వారు సేకరించి దాచుకునే స్థాయిలో ఉంటాయి.

**తానా పత్రిక
తానా సంస్థాగత విషయాలను సభ్యులకు చేర్చటం కోసం ఏర్పాటు చేసుకున్న పత్రిక తానా పాతిక. ఈపేరు పెట్టింది అప్పటి సంపాదకులు స్వర్గీయ కిడంబి రఘునాద్. 1989 వరక ఉఅప్త్రిక అప్పుడప్పుడూ వచ్చేది.నల్లమోతు సత్యనారాయణ గారు తానా అద్యక్షులుగా ఉన్నప్పుడు పత్రికను చెరుకుపల్లి నెహ్రు సంపాదకత్వంలో ప్రతినెలా ప్రచురించటం మొదలు పెట్టారు. 1993లో యలవర్తి రామరాజభూషణుడు, నేను సంపాదకులుగా ఉన్నప్పుడు పత్రికలో సంస్థాగత విషయలతో పాటు సాహిత్య సాంస్కృతిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించాం.వంగూరి చిట్టెన్ రాజు, కన్నెగంటి చంద్రశేఖర్ వివిధ దశలలో సంపాదక బాద్యతలు నిర్వహించారు. గత ఐదేళ్ళుగా కిరణ్ ప్రభ సంపాదకులుగా ఉంటున్నారు. ప్రస్తుతం తానా పత్రిక అచ్చుపత్రిక నుంచి ఎలక్ట్రానిక్ పత్రికగా మారుతోంది.

**నవలలు అనువాదాలు.
తెలుగు సాహితీ రంగంలో పెనుమార్పులు వచ్చి సరైన ప్రోత్సాహం ప్రచురించే మార్గాలు లేక నాణ్యత గల నవలలు మృగ్యమైపోతున్న సమయంలో నవలా రచనను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో, 1997 లాస్ ఏంజిల్స్ తానా సమావేశం సందర్భంగా మూడువేల డాలర్లు (అ[అప్పట్లో లక్షా ఇరవై వేలు) బహుమతిగా నవలల పోటీ నిర్వహిమ్కాహ్తానికి మురళి చందూరి తలపెట్టారు. తెలుగునాట వెలువడే ఆహ్వానం పత్రిక సహకారంతో నిర్వహించిన ఈపోటీలో చంద్రలత నవల రేగడి విత్తులు ఆ సంవత్సరం బహుమతిని గెల్చుకుంది. సహకారం: డా. జంపాల చౌదరి.
Special Story on TANA-1-TNILIVE

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com