DailyDose

దివ్య హత్య కేసు వేగవంతం చేసిన పోలీసులు-నేరవార్తలు

దివ్య హత్య కేసు వేగవంతం చేసిన పోలీసులు-నేరవార్తలు

* ప్రేమోన్మాది చేతిలో మరణించిన దివ్య తేజస్విని తల్లిదండ్రులు సీఎం జగన్‌ను కలిశారు.దివ్య తేజస్విని తల్లిదండ్రులను హోంమంత్రి సుచరిత సీఎం దగ్గరకు తీసుకెళ్లారు.వారికి జరిగిన అన్యాయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.తేజస్విని హత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.కాగా .రెండు రోజుల క్రితం విద్య కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన హోంమంత్రి సూచరితను..సీఎం గారిని కలిసే ఏర్పాటు చేయాలని దివ్య కుటుంబ సభ్యులు అభ్యర్ధించారు.దివ్య తేజస్వి తల్లిదండ్రుల విజ్ఞప్తితో సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు ఆమె ప్రత్యేకంగా చొరవ చూపించారు. 

* సచివాలయ డిజిటల్ అసిస్టెంట్​పై గ్రామ వాలంటీర్​ దాడి.గుంటూరు జిల్లా యండ్రాయిలో గ్రామ వాలంటీర్​గా పని చేస్తున్న చిల్కా వినోద్ తన వార్డు పరిధిలో కొత్తగా వచ్చిన రేషన్ కార్డు దరఖాస్తులను తీసుకొని వచ్చి…..డిజిటల్ అసిస్టెంట్ బాబురావుకి ఇచ్చాడు.పని ఒత్తిడి కారణంగా తరవాత దరఖాస్తులు పరిశీలిస్తానని వాలంటీర్ వినోద్​కి బాబురావు చెప్పాడు. ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామ వాలంటీర్​ డిజిటల్ అసిస్టెంట్ బాబురావుపై దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు.తోటి సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా…..వారి మాట లెక్క చేయకుండా చెలరేగిపోయాడు.ఈ ఘటనపై సచివాలయ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.స్థానిక నేతల రంగప్రవేశంతో వివాదం సద్దుమణిగింది.సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

* సీబీఐ, ఈడీ కోర్టులో రాష్ట్ర సీఎం జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ ఈనెల 27కు వాయిదా పడింది.సీబీఐ, ఈడీ కోర్టు న్యాయమూర్తి ఇవాళ సెలవులో ఉన్నారు.కేసు తదుపరి విచారణను ఇంఛార్జ్ న్యాయమూర్తి ఈనెల 27కి వాయిదా వేశారు.నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులోని ఈడీ కేసు నవంబరు 9కి వాయిదా పడింది.అరబిందో, హెటిరో సంస్థలకు భూకేటాయింపులకు సంబంధించిన ఈ కేసును కూడా సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్​లో ఉంది.నవంబరు 5న హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉందని న్యాయవాదులు తెలిపిన మేరకు తదుపరి విచారణను నాంపల్లి కోర్టు నవంబరు 9కి వాయిదా వేసింది.

* హిందూపురంలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ పట్టుబడ్డ వాలంటీర్లు.పట్టుబడ్డ వారిలో హిందూపురం రూరల్ మండలం వీవర్స్ కాలనీకి చెందిన ముగ్గురు, మోడల్ కాలనీకి చెందిన మరో వాలంటీర్.అదుపులోకి తీసుకుని విచారిస్తున్న వన్ టౌన్ పోలీసులు.