బంగారు దొడ్డిలో దర్జాగా…

భారత్‌లో రూ. వేల కోట్లు రుణాలు ఎగ్గోట్టి విదేశాలకు పారిపోయిన విజయ్‌మాల్యా గురించి రచయిత, ప్రొఫెసర్‌ జేమ్స్‌ క్రాబ్‌ట్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లండన్‌లో ఉండగా మాల్యాను కలవడానికి జేమ్స్‌ వెళ్లినప్పుడు ఆయనకు అక్కడో విచిత్రమైన అనుభవం ఎదురైందని తెలిపాడు. దీనిపై అతడు మాట్లాడుతూ..‘ లండన్‌లోని మాల్యా ఉంటున్న భవంతిలో ఆయనతో నాలుగు గంటలు గడిపే అవకాశం వచ్చింది. నేను అక్కడికి వెళ్లినప్పుడు ఆయన ఎంతో బాధపడుతున్నట్లు కనిపించారు. అప్పుడు ఆయన మద్యం సేవిస్తూ ఉన్నారు. ఆయనతో కాసేపు మాట్లాడిన తర్వాత మాల్యా అనుమతితో అక్కడున్న వాష్‌రూమ్‌లోకి వెళ్లాను. అక్కడ ఉన్న గోల్డెన్‌ టాయిలెట్‌ చూసి ఆశ్చర్యమేసింది. బంగారంతో చేసిన రిమ్‌,మూత కూడా ఉంది. అరె! ఇక్కడ గోల్డెన్‌ టిష్యూ పేపర్‌ కూడా ఉంటే బావుండని అనుకున్నాను. దానికి బదులుగా అక్కడ తెల్లటి, మెత్తనైన టవల్స్‌ ఉన్నాయి. అక్కడ వీటన్నింటినీ చూసి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. టాయిలెట్‌ను మెయింటెన్‌ చేసే తీరును బట్టి ఎదుటి వాళ్ల గురించి చెప్పేయవచ్చు.’ అని తెలిపారు. ఇటీవల జేమ్స్‌ భారత్‌ పర్యటనకు వచ్చినప్పుడు ఈ వివరాలు తెలిపారు. ముంబయిలోని ఓసమావేశంలో పాల్గొన్న సందర్భంగా విజయ్‌ మాల్యా గురించి ప్రస్తావించారు.

Mallyas Lavish Life in London-TNILIVE Specials

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com