రాజకీయాలు అక్కర్లేదు

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ రాజకీయాల్లోకి రానున్నారన్న వార్తలపై ఆమె స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీపై తీసిన లఘుచిత్రం ప్రత్యేక ప్రదర్శన సందర్భంగా ఇటీవల ఆమె మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశానికి మోదీయే సరైన లీడర్‌ అని వ్యాఖ్యానించడంతో కంగనా రాజకీయాల్లోకి రానున్నారన్న వార్తలు వెలువడ్డాయి. దీనిపై కంగనను వివరణ కోరగా ప్రస్తుతం తన సినీ జీవితం విజయవంతంగా నడుస్తోందని వేరే రంగంలో తన భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. దీనిపై కంగన మాట్లాడుతూ…‘ రాజకీయాలు జీవితం కాదు. నేను రాజకీయాల్లో వస్తానని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్లందరూ కొంచెం తెలివితో ఆలోచించండి. ప్రస్తుతం నా సినీ జీవితం విజయవంతంగా కొనసాగుతోంది. అలాంటప్పుడు వేరే రంగంలో నా భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన అవసరం లేదు. రెండు పడవల మీద ప్రయాణం చేయాలనుకోవడం లేదు. ఒక వేళ నేను పుట్టిన నేలకు సేవ చేయాలనిపిస్తే అందుకు రాజకీయాలే అవసరం లేదు. ఇక ఏ రంగం ద్వారా అయినా సేవ చేయవచ్చు’ అని తెలిపింది. కంగన ప్రస్తుతం వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘మణికర్ణిక’ అనే చిత్రంలో నటిస్తోంది. తెలుగు దర్శకుడు క్రిష్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో దీన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Kangana ranaut on politics-tnilive movies

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com