బంపర్ నష్టాల్లో స్టేట్ బ్యాంకు

స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా భారీ నష్టాలను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.4,876కోట్లు నష్టపోయినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే మొండి బకాయిలు 70శాతం పెరగడంతో నష్టాలను మూటగట్టుకుంది. గత ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ఎస్‌బీఐ రూ.2,006కోట్ల నికర లాభం నమోదు చేయగా ఈసారి మాత్రం భారీగా నష్టపోయింది. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో సంస్థ ఆదాయం పెరిగింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.62,911.08కోట్ల ఆదాయం రాగా ఇప్పుడు రూ.65,492.67కోట్ల ఆదాయం వచ్చినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. గత ఏడాది జూన్‌ త్రైమాసికంలో బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు 9.97శాతం పెరగగా, ఈ ఏడాది జూన్‌ నాటికి 10.69 శాతానికి పెరిగినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. గతంలో రూ.1,88,068కోట్ల స్థూల నిరర్ధక ఆస్తులు ఉండగా, ఈ ఏడాది రూ.2,12,840కోట్లుగా ఉన్నాయి. అయితే నికర నిరర్ధక ఆస్తులు మాత్రం గతంతో పోలిస్తే తగ్గాయి. గత ఏడాది ఇవి 5.97శాతంగా ఉండగా, ఈసారి 5.29శాతానికి తగ్గాయి. అంటే గత ఏడాది రూ.1,07,560కోట్ల నికర నిరర్ధక ఆస్తులు ఉండగా, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రూ.99,236కోట్లుగా నమోదయ్యాయి. బ్యాంకు ప్రొవిజన్లు గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు అయ్యాయి. గతంలో రూ.8,929.48కోట్లుగా ఉండగా ఇప్పుడు రూ.19,228కోట్లుగా నమోదయ్యాయని ఎస్‌బీఐ తెలిపింది. ఏకీకృత ప్రాతిపదికన చూస్తే.. బ్యాంకు ఈ త్రైమాసికంలో రూ.4,230కోట్ల నికర నష్టం నమోదు చేసింది. గత ఏడాది ఈ త్రైమాసికంలో రూ.3,032కోట్ల నికర లాభం వచ్చినట్లు తెలిపింది.
SBI posts heavy losses-tnilive business

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com