కరోనా వైరస్ కొమ్ములు వంచే అద్భుత ఆవిష్కారాన్ని చేసిన భారత సంతతి బాలిక అనికా చేబ్రోలు (14) అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ‘3ఎం యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్’ను గెల్చుకుంది. ఈ పురస్కారం కింద ఆమెకు 25వేల డాలర్లు లభిస్తాయి. 3ఎం యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్‌లో మొత్తం 10 మంది విద్యార్థులు ఫైనల్స్‌కు చేరుకున్నారు. ‘ఇన్-సిలికో’ అనే విధానాన్ని ఉపయోగించి.. కొవిడ్-19 కారక సార్స్-కోవ్-2 వైరస్‌లోని కీలకమైన స్పైక్ ప్రొటీన్‌కు నిర్దిష్టంగా అతుక్కునే ఒక పదార్థాన్ని అనిక కనుగొంది. ఈ ప్రయోగానికి సంబంధించిన వివరాలను శాస్త్రవేత్తలతో కూడిన న్యాయనిర్ణేతల కమిటీ విశ్లేషించి విజేతగా ప్రకటించింది. గత ఏడాది అనిక తీవ్ర ఇన్‌ఫ్లూయెంజా బారిన పడింది. దీంతో ఆ రుగ్మతకు చికిత్సను కనుగొనాలని అప్పట్లో గట్టిగా తీర్మానించుకుంది. కొవిడ్-19 విజృంభణతో తన దృష్టి.. ఆ మహమ్మారి మీదకు మళ్లిందని వివరించింది. భవిష్యత్‌లో వైద్య పరిశోధకురాలిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.
ఫ్రిస్కో అమ్మాయికి 25వేల డాలర్ల పురస్కారం
Related tags :