భారతదేశపు అతిపెద్ద పండుగలలో విజయదశమి ఒకటి. విభిన్న ఆచారాలు, సంప్రదాయాలకు నెలవైన భారత్ లో.. విజయదశమిని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలిచినా.. నవరాత్రి ప్రత్యేకత మాత్రం చెక్కు చెదరనిది. ఇక ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. నవరాత్రిని పురస్కరించుకుని చాలా మంది తొమ్మిది రోజుల పాటు ఉపవాసాలు ఉంటారు. అయితే ఇప్పటికే ఉపవాసాలు ఉండి మళ్లీ ఉంటున్నవారికి.. కొత్తగా ఉపవాసాలు చేయబోయే వారికి కొన్ని సూచనలు.
*ప్రస్తుతం మనం కరోనా కాలంలో ఉన్నాం. దేశవ్యాప్తంగా కేసులు తగ్గుతున్నట్టు కనిపించినా.. వచ్చేది శీతాకాలం. చలికాలంలో కరోనా ఉధృతి ఎక్కువవొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని కాపాడుకోవడం అత్యంత ఆవశ్యకం. అయితే ఉపవాసాల టైం కూడా దగ్గర పడుతుండటంతో ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ఉపవాసాలప్పుడు ఏం తినాలనేదానిపై కచ్చితంగా దృష్టి సారించాలి. తొమ్మిది రోజుల పాటు ఆహారం ఏం తీసుకోకుండా నిష్టగా ఉపవాసం ఉండి.. తర్వాత ఆహారం తీసుకుంటే దానికి మన శరీరం ఎలా సహకరిస్తుందనేది సందేహమే.
అయితే కొత్తగా ఉపవాసం చేసేవాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకుని దేవి నవరాత్రులను నిష్టగా పాటించొచ్చు.
1. కఠినంగా ఉండే ఉపవాసాలు చేయకపోవడమే మంచిది. అంటే.. కొంతమంది నీళ్లు కూడా ముట్టుకోకుండా వ్రతం చేస్తారు. అయితే కొత్తగా చేసేవాళ్లు అలా చేయడం మంచిది కాదు. ఈ సమయంలో దానిని చేయకపోవడమే ఉత్తమం.
2. కరోనా కాలం కాబట్టి రోగనిరోధక శక్తిని కాపాడుకోవడం ఎంతో అవసరం. అందుకే మన బాడీని డీ హైడ్రేడ్ కాకుండా చూసుకోవాలి.
3.పొడి గింజలు పోషకవిలువలున్న ఆహారం. అవి మన బాడీకి ఎంతో శక్తినిస్తాయి. ఉపవాసం సమయంలో వీటిని తినొచ్చు. రోజూవారి మీరు తీసుకునే ఆహారంలో.. బాదం, వాల్నట్, ఎండు ద్రాక్ష వంటివి ఉండేలా చూసుకోండి.
4. వ్రతం చేసే సమయంలో కుట్టు (కేరళ, తమిళనాడు లో ఫేమస్ వంటకం), సాబుదానా తో చేసిన పదార్థాలను తీసుకోండి. అందులో ఉండే హై క్యాలరీలు మీకు ఆకలి కాకుండా నిలువరిస్తాయి.
5. ఆకలేస్తుందేమోననే భయంతో అంతా ఒకేసారి తినేయొద్దు.. తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు తినేలా చూసుకోవడం ఉత్తమం.
6. సహజ పానీయాలు తీసుకోండి. మజ్జిగ, లస్సీ, షెర్బత్ లేదా పండ్ల రసాల వంటివి తీసుకుంటే బాడీ డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. అంతేగాక శరీరానికి అవసరమయ్యే శక్తి కూడా అందుతుంది.
నవరాత్రి ఉపవాసకులకు సూచనలు
Related tags :