NRI-NRT

అమెరికా ఎన్నికల్లో తెలుగు వెలుగులు

అమెరికా ఎన్నికల్లో తెలుగు వెలుగులు

తెలుగు భాషకు అమెరికా అరుదైన గుర్తింపు లభించింది. తెలుగు భాషకు అమెరికా పట్టంకట్టింది. అమెరికాలో కమ్యూనికేషన్ కోసం తెలుగు భాషను అధికారిక భాషగా గుర్తిస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 3న అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలో ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రపంచ భాషల్లో బ్యాలెట్ పత్రాలను ముద్రిస్తారు. ఇప్పటి వరకు కొన్ని ఇండియన్ భాషలు మాత్రమే ఈ జాబితాలో ఉండేవి. ప్రస్తుతం వాటి సరసన తెలుగు కూడా చేరింది. దీంతో తెలుగులో కూడా బ్యాలెట్ పేపర్ల ముద్రణ జరగనుంది.అమెరికాలో తెలుగు భాషను అధికార భాషగా గుర్తించడం ద్వారా ఇకపై ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సమాచారంతోపాటు అధికార కార్యకలాపాల వివరాలను కూడా తెలుగులో తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. అధికారిక లెక్కల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 15 కోట్ల మంది తెలుగు మాట్లాడే వారు ఉన్నారు. అమెరికాలో కూడా తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఎక్కువే ఉంది. కాగా.. అమెరికాలో తెలుగు భాషకు దక్కిన గౌరవంపట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.