* చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతంలో భారీ దోపిడీ జరిగింది. ఈ సందర్భంగా సెల్ ఫోన్లుతో వెళ్తున్న లారీ చోరీకి గురైంది.చెన్నై పొందుమలై నుంచి ఎమ్ఐ కంపెనీకి చెందిన సెల్ ఫోన్ల లారీ ముంబైకు వయా కృష్ణగిరి నుంచీ బెంగళూరు మీదుగా బయలుదేరింది.మార్గమధ్యంలో కృష్ణగిరి జిల్లా సూలగిరి వద్ద లారీని అడ్డగించిన దుండగులు లారీలో ఉన్న రూ.10 కోట్ల విలువ చేసే మొబైల్ లు దోపిడీ చేసి దుండగులు పరారయ్యారు.హోసూర్ డిఎస్పి మురళీధర్ ఆధ్వర్యంలో 10 పోలీస్ బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నారు.ఈ దోపిడీ తమిళనాడు- ఆంధ్ర సరిహద్దులో కలకలం రేపింది.
* తుళ్లూరు రిటైర్డ్ తహసీల్దార్ సుధీర్‌బాబు క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
* తిరుపతిలోని మంగళం ప్రాంతానికి చెందిన సాయి కుమార్, వెంకటేష్ సోదరులు మంగళంలో కూరగాయలు, పండ్ల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు.కుటుంబ కలహాలతో వీరిరువురూ తిరుచానూరు సమీపంలోని దామినేడు చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
* దుర్గగుడి వద్ద విరిగిపడిన కొండచరియలు.రేకులషెడ్డు ధ్వంసం, ముగ్గురు కార్మికులకు గాయాలు.సీఎం రాక సందర్భంగా రాకపోకలు నిలిపివేయడంతో తప్పిన ప్రమాదం.దుర్గమ్మకు పట్టువస్త్రాలు ఇచ్చేందుకు కాసేపట్లో రానున్న సీఎం జగన్.విరిగిపడిన కొండచరియలను తొలగిస్తున్న సిబ్బంది.
* మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. సూరత్‌కు వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడగా.. ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. 35 మందికి గాయపడ్డారు.