ఎవరి పవిత్రతనైనా తులసితో పోల్చుతారు. తులసి అనే పదానికి పోల్చడానికి వీల్లేనిది అని అర్థముంది. అంతటి జగదేక సుందరి మానసికంగా మరింత అద్భుతమైంది. నిష్కల్మషంగా ఉండడం ఆమె నైజం. పాతివ్రత్యం ఆమె వ్రతం… తాను నమ్మిన ఆ రెండింటి కోసం శ్రీ మహావిష్ణువునే శపించిందామె. పూర్వ జన్మలో ఇచ్చిన మాట ప్రకారం ఆమెను అనుగ్రహించడానికి వచ్చిన శ్రీమన్నాయణుడిని అపార్థం చేసుకుంటుంది తులసి. గత జన్మ వృత్తాంతాన్ని గ్రహించలేక… తన విలువలను భంగ పరిచాడంటూ శ్రీహరిని ఆమె గండ శిలగా మారమని శపించింది. నాటి నుంచి గండకీ నదిలో విష్ణురూపాలైన సాలగ్రామ శిలలు ఏర్పడ్డాయి. ఆమె పవిత్రతకు అబ్బుర పడిన శ్రీమన్నారాయణుడు ఆమె తల కేశాలు మొక్క రూపంలో మారతాయని, వాటికి సర్వలోకాల్లో పూజార్హత ఉంటుందని వరమిచ్చాడు. అప్పటి నుంచి ప్రతి పూజలో, ప్రతి ఇంటి పెరట్లో తులసి ఆరాధనలందుకుంటోంది. తులసి మాలతో పూజ చేస్తే అశ్వమేథయాగం చేసిన ఫలం దక్కుతుందంటారు. పవిత్రత, హృదయశుద్ధి భగవంతుడినైనా శపించగలిగే శక్తినిస్తుందనేది తులసి కథలో అంతరార్థం.
ఆమె కేశాలే తులసీగా మారాయి
Related tags :