NRI-NRT

శతకం రచించిన “మనబడి” విద్యార్థిని

NRI Telugu Kid Manabadi Student Ahala Writes Satakam In Telugu

సిలికానాంధ్ర మనబడిలో ప్రసూనం తరగతిని పూర్తి చేసిన పూర్వ విద్యార్థిని అయ్యలసోమయాజుల అహల(10) “అహలమాట” పేరిట శతకాన్ని రచించింది. ఈ శతకాన్ని ఆదివారం నాడు అంతర్జాలం ద్వారా విడుదల చేస్తున్నట్లు మనబడి ప్రతినిధులు కుచిభొట్ల ఆనంద్, రాజు చమర్తి, కొండుభట్ల దీనబాబు, రాయవరం విజయభాస్కర్‌లు తెలిపారు. మనబడిలో మూడేళ్ల పాటు విద్యనభ్యసించిన ఈ చిన్నారి తెలుగు భాషపై మక్కువతో ఈ రచనకు శ్రీకారం పలకడం పట్ల ప్రవాస తెలుగు భాషాభిమానులు హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. మనబడి మరిన్ని వివరాలకై – www.manabadi.siliconandhra.orgను చూడవచ్చు.
శతకం రచించిన