ఐసీసీ వరల్డ్ కప్‌కు సమయం ఆసన్నమైంది. మరో రెండు వారాల్లో ఇంగ్లండ్ వేదికగా మెగా టోర్నీ అట్టహాసంగా ప్రారంభంకానున్నది. అయితే ఈసారి జరిగే వన్డే క్రికెట్ వరల్డ్‌కప్ చరిత్రలో నిలువనున్నది. టోర్నమెంట్ చరిత్రలోనే మొట్టమొదటిసారి విజేత జట్టుకు అత్యధిక ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. ఈ ఏడాది ఇంగ్లండ్‌లో జరగనున్న వరల్డ్‌కప్‌లో.. ఫైనల్ విజేతకు 28 కోట్ల క్యాష్ అవార్డు ప్రజెంట్ చేయనున్నారు. మొత్తం 10 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. ఇక ఫైనల్ టీమ్ విజేతకు క్యాష్ అవార్డుతో పాటు ట్రోఫీని కూడా బహూకరిస్తారు. లార్డ్స్ లో జూలై 16వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనున్నది. క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ కోసం మొత్తం 10 మిలియన్ల డాలర్లు ప్రైజ్‌మనీ కేటాయించారు. వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచే జట్టుకు 14 కోట్ల ప్రైజ్‌మనీ వస్తుంది. సెమీఫైనల్ చేరిన జట్లకు 8 లక్షల డాలర్లు(5 కోట్ల 61 లక్షలు) ఇస్తారు. వరల్డ్‌కప్ టోర్నీ మొత్తం 46 రోజులు జరగనున్నది. ఇంగ్లండ్‌లోని 11 మైదానాల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ దశలోనూ ప్రతి మ్యాచ్‌కు ప్రైజ్‌మనీ ఉంది. ఈనెల 30వ తేదీన నుంచి వరల్డ్‌కప్ మ్యాచ్‌లు మొదలవుతాయి.
ఐసీసీ క్రికెట్ కప్ విజేతకు ₹28కోట్లు
Related tags :