Sports

ఆవులపై తూటాల వర్షం

ఆవులపై తూటాల వర్షం

వికారాబాద్ అడవుల్లో కాల్పుల ఘటనలో కొత్త కోణం వెలుగుచూసింది. దామగుండంలో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అలాగే ఆమె బంధువులకు ఫామ్ హౌజ్ లు ఉన్నాయని ఆ ఫామ్ హౌజ్ కు వస్తున్న వారే కాల్పులు జరుపుతున్నారని స్ధానికులు ఆరోపిస్తున్నారు.  ఫామ్ హౌజ్ దరిదాపుల్లోకి పశువులు తీసుకొని రావద్దు అంటూ నిర్వాహకులు తమను బెదిరిస్తున్నారు అని స్థానికులు ఫిర్యాదు చేసారు. దీంతో ఫామ్ హౌజ్ నిర్వాహకులు, సిబ్బందిని విచారించారు పోలీసులు. ఈ విచారణలో కీలక సమాచారం సేకరించారు. స్వాధీనం చేసుకున్న బుల్లెట్ ఏ రివాల్వర్ నుంచి వచ్చిందో దర్యాప్తు చేస్తున్నారు. ఆవు బుల్లెట్ గాయాల తర్వాత ఫామ్ హౌజ్ నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. ఆ ఫామ్ హౌజ్ కు చెందిన వారే కాల్పులకు పాల్పడి ఉంటారని పోలీసులు అంచనాకు వచ్చారు.