బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మరో వారసురాలు అథియా శెట్టి. లాక్‌డౌన్‌తో దాదాపు ఆరు నెలలు ఇంట్లోనే ఉన్న అథియా… తాజాగా ‘లాక్మే ఫ్యాషన్ వీక్’లో తళుక్కుమంది. అబ్స్ట్రాక్ట్ ప్రింట్, సీక్విన్స్ వర్క్‌తో మల్టీకలర్ స్కర్ట్… దానికి మ్యాచింగ్‌గా ఫుల్ స్లీవ్డ్ వీ-నెక్ బ్లౌజ్ వేసుకుని డిజిటల్ ర్యాంప్‌పై వయ్యారాలు ఒలికించింది. ‘జీరో వేస్ట్’కు సంబంధించి దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ దిశా పాటిల్ ఈ కలెక్షన్ రూపొందించారు. ఫ్యాక్టరీల్లో పక్కన పడేసిన సాక్స్ బ్యాండ్స్‌ను ఎంబ్రయిడరీకి ఉపయోగించి, ఆరి టెక్నిక్‌తో ఈ అకేషన్వేర్ రెడీ చేశారు. ఈ డ్రెస్‌లో అంతే ఒద్దికగా ఒదిగిపోయింది అథియా. ‘‘దాదాపు ఏడు నెలల తరువాత మేకప్ వేసుకున్నా. ఈ షో నాలో పునరుత్తేజం నింపింది. ఇంట్లో ఉంటే సన్‌బ్లాక్, లిప్‌బామ్ తప్ప వేరే ఏమీ వాడలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ మొదలైన తరువాత డ్రెస్సింగ్ స్టయిల్స్ మారిపోయాయి. ‘నువ్వు ఇలాగే కనిపించాలి’ అని ఒత్తిడి చేసేవారు ఇప్పుడు లేరు. సహజత్వంలో ఉన్న అందం మరెందులోనూ రాదు. నా వరకైతే పెద్దగా మేకప్‌లు, అలంకరణలు లేకుండా సౌకర్యవంతమైన దుస్తులు ధరించడమంటేనే ఇష్టం’’ అంటున్న అథియాకు ఈ వర్చువల్ ఫ్యాషన్ షోలు అస్సలు నచ్చలేదట. ఏదైనా ప్రత్యక్షంగా నలుగురి మధ్యా క్యాట్‌వాక్ చేస్తే… అది ఆత్మవిశ్వాసాన్ని పెంచి, ప్రోత్సాహాన్ని స్తుందనేది అథియా మాట.
పదిమందిలొ చేయాలి
Related tags :