డబ్బును వేలల్లో చెప్పాల్సి వచ్చినప్పుడు పక్కన ఆంగ్ల అక్షరం ‘కె’ పెట్టడం వెనుక పెద్ద కథే ఉంది. గ్రీకు భాషలో వెయ్యిని ‘కీలియోయ్’ అని పలుకుతారు. ఆ తర్వాత దాన్ని ఫ్రెంచ్‌లో సులభంగా పలికేలా ‘కిలో’గా మార్చారు. ఆపైన మెట్రిక్ పద్ధతి అమల్లోకి వచ్చినప్పటి నుంచీ కిలోను 1000కి సూచనగా వాడటం మొదలెట్టారు. కిలోగ్రామ్, కిలోలీటర్, కిలోటన్ వంటి పదాలు పుట్టుకొచ్చాయి. దాన్ని డబ్బుకు కూడా అనుసంధానం చేస్తూ పక్కన మూడు సున్నాలు పెట్టకుండా సింపుల్‌గా ‘కె’ అని పెట్టి వదిలేయడం అలవాటైంది.
వేలు చెప్పాలంటే K ఎందుకు వాడతారు?
Related tags :