దోమలు.. ఇవి చూడటానికి చిన్నగానే ఉంటాయి కానీ.. వీటి వల్ల ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి వ్యాధులు వస్తాయి. అందుకే.. దోమలు ఎక్కువగా సంచరించే చెరువులు, కుంటల్లో దోమలను లేకుండా చేస్తే.. నగరంలో దోమల సమస్యకు చెక్ పెట్టొచ్చని ఆలోచించిన జీహెచ్‌ఎంసీ.. వాటి నివారణకు వినూత్న ప్రయోగం చేస్తోంది. వాటిని నివారించడానికి డ్రోన్స్‌ను ఉపయోగిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన మారుత్ అనే స్టార్టప్‌తో కలిసి దోమల నివారణకు విశేష కృషి చేస్తోంది జీహెచ్‌ఎంసీ. డ్రోన్స్‌లో బయో ఎంజైమ్స్ నింపి.. వాటిని చెరువుల్లోకి పంపించి వాటిని చెరువు మొత్తం స్ప్రే చేయిస్తారు. దీని వల్ల దోమలు చనిపోవడంతో పాటు.. వాటి గుడ్లు కూడా ఆ దశలోనే విచ్చిన్నం అయిపోతాయి. చెరువుల్లో స్ప్రే చేసేందుకు ఉపయోగించే మిశ్రమాన్ని వేప ఆకులు, ఆవు పెండ, సిట్రోడొరా అనే చెట్టు ఆకులతో తయారు చేస్తారు. ఈ మిశ్రమాన్ని చెరువుల్లో, కుంటల్లో డ్రోన్స్ ద్వారా స్ప్రే చేయిస్తారు. చెరువుల్లో ఉండే కొన్ని రకాల చెట్లు కూడా ఈ స్ప్రేతో చనిపోతాయి. వాటికవే ఎండిపోతాయి. అనంతరం దోమలు కూడా చనిపోతాయి. నిజానికి.. చెరువుల్లో వర్కర్స్‌తో స్ప్రే చేయించాలంటే రెండు వారాల నుంచి నెల వరకు సమయం పడుతుందట. ఒక్క చెరువును కవర్ చేయడానికి 20 నుంచి 25 మంది వర్కర్స్ కావాల్సి ఉంటుంది. అదే స్ప్రేను డ్రోన్స్‌తో చేయిస్తే కేవలం 10 నిమిషాల్లోనే ఒక చెరువంతా కవర్ అయిపోతుంది. ఒక్క రోజులో 25 ఎకరాల వరకు డ్రోన్స్ కవర్ చేయగలవు. అంటే గంటకు 5 నుంచి 6 ఎకరాల వరకు అవి కవర్ చేస్తాయి. డ్రోన్ల వల్ల జీహెచ్‌ఎంసీకి చాలా లాభం చేకూరుతుంది. త్వరగా అన్ని చెరువుల్లో స్ప్రే చేయడంతో పాటు.. డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చుకావు. డ్రోన్లతో ఎలా మిశ్రమాన్ని చెరువుల్లో స్ప్రే చేస్తారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=GuB0C9JbV5w
డ్రోన్లతో దోమలపై యుద్ధం చేస్తున్న GHMC
Related tags :