వేలానికి యాపిల్1

అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్సత్తుల సంస్థ యాపిల్‌కు చెందిన అరుదైన కంప్యూటర్‌ను వేలం వేయనున్నారు. యాపిల్‌ వ్యవస్థాపకులు స్టీవ్‌ జాబ్స్‌, స్టీవ్‌ వోజ్నిక్‌ 1970ల్లో రూపొందించిన యాపిల్‌ 1 కంప్యూటర్‌ను బోస్టన్‌కు చెందిన ఆర్ఆర్‌ వేలం సంస్థ సెప్టెంబర్‌ 25న వేలం వేయనుంది. వేలంలో ఈ కంప్యూటర్‌ 3లక్షల డాలర్లు పలకనుందని అంచనా. ఈ కంప్యూటర్‌ పూర్తిగా వర్కింగ్‌ కండీషన్‌లో ఉంది. అప్పట్లో ఇలాంటివి దాదాపు 200 కంప్యూటర్లను తయారుచేయగా ఇప్పుడు వాటిలో 60దాకా ఇంకా పనిచేస్తున్నాయి. యాపిల్‌-1 కంప్యూటర్‌గా పిలిచే ఇది డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌. దీన్ని 1976లో యాపిల్‌ కంపెనీ విడుదల చేసింది. దీనిని బైట్‌ షాప్‌ స్టైల్‌ యాపిల్‌ 1 మోడల్‌ అని పిలుస్తారు. వేలంలో కేవలం మదర్‌ బోర్డ్ మాత్రమే కాకుండా‌, అసలైన మ్యానువల్‌, పీరియడ్‌ స్టైల్‌ మానిటర్‌, కీ బోర్డు కూడా ఉన్నాయి. ఈ కంప్యూటర్‌ను రూపొందించిన దాదాపు 40ఏళ్ల తర్వాత ఇప్పుడు వేలానికి వేయనున్నారు. కంప్యూటర్‌ వేలానికి బిడ్లను ఆహ్వానిస్తున్నామని ఆర్‌ఆర్‌ వేలం సంస్థ వెల్లడించింది. దాదాపు 3లక్షల డాలర్లు పలుకుతుందని అనుకుంటున్నట్లు తెలిపింది. యాపిల్‌ 1 నిపుణుడు కోరే కోహెన్‌ ఈ మెషిన్‌ను 2018 ప్రారంభంలో పునరుద్ధరించారు. అధికారికంగా దీనికి 10కి 8.5రేటింగ్‌ ఇచ్చారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com