అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో హైదరాబాద్‌కు చెందిన 37 ఏళ్ల మొహమ్మద్ ఆరిఫ్ మోయినిద్దిన్ హత్యకు గురయ్యాడు. ఇంటి వద్దే అతన్ని కత్తితో పొడిచి చంపారు. అయితే ఆరిఫ్ అంత్యక్రియులు జరిపేందుకు అమెరికా వెళ్లడానికి అనుమతి ఇవ్వాలంటూ అతని కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. గత పదేళ్ల నుంచి జార్జియాలో ఆరిఫ్ ఓ కిరాణా దుకాణం నడిపిస్తున్నాడు. తనకు, తన తండ్రికి అమెరికా వెళ్లేందుకు ఎమర్జెన్సీ వీసా ఇప్పించాలని ఆరిఫ్ భార్య ఫాతిమా ప్రభుత్వాన్ని కోరింది. కొంత మంది ఆరిఫ్పై దాడి చేసినట్లు సీసీటీవీ ఫూటేజ్ ద్వారా తెలిసింది. ఆరిఫ్ మృతదేహం జార్జియా హాస్పిటల్లో ఉన్నదని, అక్కడ ఆయనకు ఎవరూ లేరని, అందుకే అమెరికా వెళ్లే అవకాశం ఇవ్వాలని ఆయన భార్య కోరింది. తెలంగాణకు చెందిన మజ్లిస్ బచావో తెహ్రీక్ పార్టీ ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి జయశంకర్‌కు అభ్యర్థన లేఖ రాసింది.
జార్జియాలో హైదరాబాదీ హత్య
Related tags :