రోహిత్‌శర్మ గాయం విషయంలో బీసీసీఐ వ్యవహార శైలి బాగాలేదని టీమ్‌ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శించారు. హిట్‌మ్యాన్ పరిస్థితి ఏంటో కోచ్ రవిశాస్త్రికి తెలియదంటే తాను ఒప్పుకోనని పేర్కొన్నారు. గాయపడి విశ్రాంతి తీసుకున్న రోహిత్ హైదరాబాద్ మ్యాచులో బరిలోకి దిగడంతో వీరూ బోర్డుపై ఘాటుగా విమర్శలు చేశారు. ‘రోహిత్ పరిస్థితి ఏంటో రవిశాస్త్రికి తెలియకుండా ఉండే అవకాశం లేదు. సెలక్షన్ కమిటీలో అతడు భాగం కానప్పటికీ ఎంపికకు రెండు మూడు రోజుల ముందైనా శాస్త్రి అభిప్రాయమేంటో సెలక్టర్లైనా మాట్లాడి ఉంటారు. ఆయన్నుంచి కొన్ని సూచనలు స్వీకరిస్తారు. నిజానికి రోహిత్ గాయపడి ఉంటే అతడి స్థానంలో మరెవరినైనా ప్రత్యామ్నాయంగా ప్రకటించాలి. అలా చేయలేదు. అతడికీ జట్టులో చోటివ్వలేదు. ఇదే నాకు అర్థంకావడం లేదు. ఈ ఏడాది వింతగా ఉంది. ఇప్పుడు మీరేం చేస్తారు? రోహిత్ హైదరాబాద్‌పై ఆడాడు. మున్ముందు ప్లేఆఫ్స్ కూడా ఆడతాడు. దృఢంగా ఉన్నానని అతడు అంటున్నాడు. అలాంటప్పుడు ఎందుకు ఎంపిక చేయడం లేదు’ అని వీరూ ప్రశ్నించాడు.
సెహ్వాగ్‌కు కోపం వచ్చింది
Related tags :