2020 నుంచి ఏకంగా ముప్ఫై ఏళ్లు ముందుకు వెళ్లి 2050లోకి అడుగుపెట్టబోతున్నారు శ్రద్ధా శ్రీనాథ్. ఎందుకు అంటే? ఆమె అంగీకరించిన తాజా చిత్రం ‘కలియుగం’ కథ 2050 నేపథ్యంలో సాగుతుంది. ‘జెర్సీ’లో మంచి నటన కనబరచిన శ్రద్ధా ఈ చిత్రకథ వినగానే అంగీకరించారట. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఆర్.కె. ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కేఎస్ రామకృష్ణ నిర్మించనున్నారు. పలు వాణిజ్య ప్రకటనలకు దర్శకత్వం వహించిన ప్రమోద్ సుందర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ – ‘‘కథ విన్న వెంటనే ఈ సినిమా ఒప్పుకున్నాను. అంత గొప్పగా ఉంది. ఇంత మంచి అవకాశం ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదు’’ అన్నారు. ‘‘అద్భుతమైన కథతో హారర్ థ్రిల్లర్ జానర్లో ఈ సినిమా ఉంటుంది. 2021 జనవరిలో షూటింగ్ ప్రారంభిస్తాం. 2050 బ్యాక్‌డ్రాప్ కాబట్టి సెట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ అసిస్టెంట్ రామ్‌చరణ్ సినిమాటోగ్రాఫర్‌గా చేయనున్నారు.
2050లోకి వెళ్తున్న శ్రద్ధా శ్రీనాథ్
Related tags :