* జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి గ్రామశివారులో మాజీ మంత్రి పరిటాల సునీత సమీప బంధువు పరిటాల తిప్పన్న వ్యవసాయ క్షేత్రంలో పేకాట స్థావరాన్ని గుర్తించారు. అక్కడ పేకాట ఆడుతున్న 10 మంది పరిటాల అనుచరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని, నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో పరిటాల సునీత ముఖ్య అనుచరుడు రామ్మూర్తి నాయుడు ఉన్నట్లు సమాచారం.
* దువ్వాడ పొలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల దందా గుట్టురట్టయ్యింది. వివరాల్లోకెళ్తే.. కూర్మన్నపాలేం ప్రాంతంలో పాన్ షాపులలో ఆకస్మిక తనిఖీలుచేసి, తాము ఫుడ్ ఇన్‌స్పెక్టర్లమంటూ హడావిడి చేసారు. షాపులో నిషేదిత గుట్కాలను పట్టుకుని కేసు నమోదు చేస్తాం. మీకు అపరాద రుసుంతో పాటు ఆరునెలలు జైలు శిక్ష కూడా పడుతుందని భయపెట్టారు. దీంతో వ్యాపారస్ధులు భయబ్రాంతులకు గురయ్యారు. నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు, అసిస్టెంట్, కారు డ్త్రెవర్, వాళ్ళు వచ్చిన కారుపై ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని ఉండడంతో వ్యాపారస్తులు భయపడ్డారు.
* విజయ్ పేరు, ఫొటో వ్యవహారంలో తనపై కేసులు పెట్టి జైల్లో పెట్టిచ్చినా పర్వాలేదు అని ఆయన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. విజయ్ మంచి కోసమే తాను రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యానని పేర్కొన్నారు. సినీ నటుడు విజయ్ పేరిట ఆయన తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్ రాజకీయ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషన్ గుర్తింపుకోసం దరఖాస్తు వెల్లడం చర్చకు దారి తీసింది. ఇది పూర్తిగా తన వ్యక్తిగతం అని ఎస్‌ఏ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ పార్టీకి తనకు సంబంధం లేదని, తన ఫొటో, పేరును వాడుకుంటే చట్టపరంగా చర్యలు తప్పవని విజయ్ హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో శనివారం ఓ ఛానల్‌కు ఎస్‌ఏ చంద్రశేఖర్ ఇంటర్వూ్య ఇచ్చారు.
* కర్ణాటక మహిళా ఐఏఎస్ అధికారి నివాసంపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. కర్ణాటకలోని ఇన్ఫర్మేషన్ అండ్ బయోటెక్నాలజీ శాఖలో ఆఫీసర్‌గా పని చేస్తున్న సుధ ఇంట్లో శనివారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు నగదు, బంగారు ఆభరణాలను భారీగా స్వాధీనం చేసుకున్నారు.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని మోడల్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ కుటుంబం శనివారం కూలిపనులకు వెళ్ళింది. ఇంటి వద్ద ఆడుకుంటున్న సుమారు 6 ఏళ్ల బాలికను ఇద్దరు యువకులు దౌర్జన్యంగా లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడుతూoడగా బాలిక కేకలు వేయడంతో అదే సమయంలో బాలిక తల్లి అక్కడకు చేరుకొని గ్రామస్తులకు సమాచారం ఇవ్వటంతో ఇద్దరు యువకులను దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ ఉపేందర్ రావు విచారించి బాలికను చికిత్స నిమిత్తం అశ్వారావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లైంగిక దాడికి యత్నించిన ఇద్దరు యువకులు మైనర్లు అని స్థానికులు చెబుతున్నారు. ఇదే విషయమై సిఐ ని వివరణ కోరగా బాలికపై లైంగిక దాడి జరిగిందా లేదా అనే కోణంలో విచారణ చేస్తున్నామని ఆయన తెలిపారు.