కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి న్యాయవాది అశ్వినీకుమార్ రాసిన లేఖపై మరోసారి ఏజీ కేకే వేణుగోపాల్ స్పందించారు.
కోర్టు ధిక్కరణకు సమ్మతిపై పునఃపరిశీలించాలంటూ ఏజీకి అశ్వినీకుమార్ ఇటీవల రెండో సారి లేఖ రాశారు.
సీఎం జగన్, అజయ్‌కల్లంపై కోర్టు ధిక్కరణ చర్యలకు సమ్మతి ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
న్యాయవాది అశ్వినీకుమార్ లేఖకు మరోసారి సమాధానమిచ్చిన ఏజీ ఈ అంశం సీజేఐ పరిధిలో ఉన్నందున సమ్మతి ఇవ్వలేనంటూ పునరుద్ఘాటించారు.
సమ్మతి ఇచ్చే అంశాన్ని పునఃపరిశీలించాలన్న విజ్ఞప్తిని నిరాకరించిన ఏజీ జగన్ లేఖపై సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునే పరిధి సుప్రీంకోర్టుకు ఉందన్నారు.
జగన్ లేఖలో దురుద్దేశపూర్వక ఆరోపణలు ఉన్నట్టు గతంలోనే తెలిపారన్న ఏజీ కేకే వేణుగోపాల్ సీజేఐకి రాసిన లేఖ మీడియాలో ప్రచారమైనందున ప్రైవేటు అని వర్ణించలేమన్నారు.
ఈ అంశాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్ల వచ్చని అశ్వినీకుమార్‌కు ఏజీ సూచించారు.
సుమోటోగా స్వీకరించాలని జడ్జిలను అభ్యర్థించే విషయంలో తన సమ్మతి నిరాకరణ అడ్డురాదని ఏజీ వేణుగోపాల్ వెల్లడించారు.