NRI-NRT

అమెరికా ఎన్నికల్లో బాలకృష్ణకు ఓటు

Someone Voted For Nandamuri Balakrishna In USA Elections 2020

మన దేశంలో కొందరు ఓటర్లు బ్యాలెట్‌ పత్రాలపై అభిప్రాయాలు రాయడం, ఆ పెట్టెల్లో ఇష్టదైవాల చిత్రాలు వేయడం గమనిస్తుంటాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ బ్యాలెట్‌ పత్రంపై సీబీఎన్‌, బాలయ్య, జగన్‌ వంటి పేర్లు రాసినట్లు లెక్కింపులో వెలుగు చూసింది. బ్యాలెట్‌ పత్రంలో ప్రముఖ పార్టీలు కాకుండా థర్డ్‌ పార్టీగా వ్యవహరించే పోటీదారుల్లో ఎవరినైనా ఎన్నుకోవాలంటే చివరి కాలమ్‌లో వారి పేరు రాయాల్సి ఉంటుంది. ఆ స్థలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు దర్శనమివ్వడం గమనార్హం.