తలనొప్పి మందుగానే ఎక్కువగా వాడే ఆస్ప్రిన్, కొవిడ్‌తో ఆసుపత్రి పాలైనవాళ్లకీ మంచిదే అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు. ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండి కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరిన 55 సంవత్సరాల వయసున్న వాళ్లకు కొద్దిమోతాదులో రోజుకి 81 మి.గ్రా. చొప్పున ఆస్ప్రిన్ ఇచ్చినప్పుడు- హృద్రోగ సమస్య తగ్గిందని చెబుతున్నారు. ఆస్ప్రిన్ ఇవ్వనివాళ్లతో పోలిస్తే ఇచ్చినవాళ్లలో కొందరికి వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం తగ్గితే, మరికొందరిని ఐసీయూలో చేరకుండా చేసింది. ఎందుకంటే కొవిడ్-19 సమస్యతో ఉన్నవాళ్లలో గుండె, ఊపిరితిత్తుల రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టడం దాంతో ఆయా అవయవాలు దెబ్బతిని మరణించిన కేసులు ఎక్కువగానే ఉంటున్నాయి. అయితే ఆస్ప్రిన్ ఇచ్చినవాళ్లలో ఈ సమస్య తక్కువగా ఉందట. కాబట్టి ఆస్ప్రిన్ కొవిడ్‌కీ మందులా పనిచేస్తుంది అంటున్నారు.
రోజుకొక ఆస్ప్రిన్ ఎందుకు మంచిది?
Related tags :