అంధుల ఆశాజ్యోతి లూయిస్ బ్రెయిలీ విశేషాలు

ప్రపంచంలో అందులందరికి ఒక ప్రత్యెకమైన పద్దతిలో ఏ భాషవారైనా మాట్లాడుకునేందుకు వీలుగా ఒక గొప్ప బాషను కనుక్కున్నా వ్యక్తీ లూయీస్ బ్రెయిలీ. 19వ శతాబ్దంలో అతడు కనుక్కున్న భాషకు మరో ప్రత్యామ్న్యాయ బాష కనీ, మెరుగైన భాష కానీ 21వ శతాబ్దంలో కూడా లేదు. అంటే బ్రెయిలీ భాష ఎంత గొప్పదో ఎంత ముందుచూపుతో రూపొందించినదో ఊహించవచ్చు. ఒక రకంగా అంధులకు పరోక్ష వెలుగు పంచిన వాడు బ్రెయిలీ. అలాంటి వెలుగులు పంచిన ఆ బ్రెయిలీ కూడా అంధుడే. కానీ దురదృష్టం ఏమిటంటే అతను కష్టపడి కనుక్కున్నా ఆ లిపిని ఆయన ఎంతగా తపించినా ఆయన బతికున్న సమయంలో ప్రపంచం అంగీకరించలేకపోవటం. లూయిస్ బ్రెయిలీ ప్యారీస్ కి తూర్పుగా ఇరవై మైళ్ళ దూరంలో ఉన్న చిన్న పట్టణంలో జన్మించాడు. నలుగురు పిల్లలలో చిన్నవాడు. తండ్రికి ద్రాక్ష తోటలున్నాయి మరోవైపు గుర్రాలకు కట్టే తోలు వస్తువులు తయారు చేసేచోటుకు పిల్లల్ని రానిచ్చేవాడు కాదు. కానీ చిన్న పిల్లాడిన లూయీస్ ఆట ప్రదేశం ఆ వర్క్ షాప్ బుజ్జిబుజ్జి అడుగులు వేసుకుంటూ తిరుగుతుండేవాడు. మూడేళ్ళ వయసులో ఒకసారి తోలు కుట్టేందుకు అక్కడ పెట్టి ఉంచిన వస్తువులతో ఆడుకుంటున్న లూయీ కంటికి బలంగా తగిలింది. తోలు తగిలింది, మరో వస్తువు తగిలిందో కానీ కన్ను కందిపోయింది పిల్లాడిని ప్యారీస్ కి తీసుకువెళ్ళాడు.
**అయినా ఆ కంటిచూపును కాపాడలేకపోయారు. కంటికి ఇన్ఫెక్షన్ సోకింది. ఆ ఇన్ఫెక్షన్ రెండవ కంటికి పాకింది. రెండు కళ్ళులో చూపులేదు. కళ్ళు కనిపించకపోవడం అంటే ఏమిటో తెలియని వయసు. నాకెందుకు ఎప్పుడూ చీకటే కనిపిస్తోంది అంటూ అమాయకంగా అడిగే లూయీస్ బ్రెయిలీకి ఏం చెప్పాలో తల్లిదండ్రులకు తెలియలేదు. తల్లిదండ్రులు జాగ్రత్తగా అతనిలో ధైర్యం నింపారు. వారి పట్టణంలో వీధులు ఎలా ఉంటాయి ఎక్కడ నడవాలి, ఎలా నడవాలి నేర్పారు. వాటి ప్రకారం అతడు ధైర్యంగా నడిచేవాడు. ఆ తరువాత అమ్దుల పాటశాలలో చేర్చారు. ప్రపంచంలోని తోలి అంధుల పాటశాల అదే.1819 లో ఆ స్కూల్ లో చేరాడు. అక్కడి వాతావరణం అంట గొప్పగా ఉండేది కాదు. సౌకర్యాలు తక్కువ, పరిశుభ్రత తక్కువ. అటువంటి చోట బ్రెయిలీ ఆరోగ్యంపాలైంది. తరచుగా అనారోగ్యం వస్తుండేది. శ్వాస కోశ ఇబ్బందులు ఎప్పుడూ దగ్గు, అయినా అదే వాతావరణంలో చదువుకునేందుకు వెళ్ళాడు. ఇంటికి తిరిగి వెళ్తానని అనలేదు. ఆ స్కూల్లో నాడు అంధుల కోసం అనుసరించే విధానం వాలెంటైన్ హ్యు రూపొందించినది. ఆ పాటశాలలో లైన్ టైప్ అనే పద్దతిలో నేర్పిన చదువును చదువుకుని పదిహేడవ ఏటకల్లా ఆ పాటశాలలోనే ప్రొఫెసర్ అయ్యాడు. తానూ నేర్చుకున్న పద్దతి సరికాదని అంతకన్నా మెరుగైన పద్దతిలో పిల్లలకు నేర్పాలని లూయిస్ బ్రెయిలీ భావించాడు. పగలు పిల్లలకు పాటాలు, రాత్రిళ్ళు తన ప్రయోగం అప్పటికి ఉన్న పన్నెండు చుక్కల విధానాన్ని తగ్గించి ఆరుచుక్కలతో అవసరమైన రీతిలో పేర్చుతూ అక్షరాలు, అంకెలు , సంగీత చిహ్నాలను రూపొందించారు. లూయీస్ బ్రెయిలీ నిరంతరం శ్రమపడిన లూయీస్ బ్రెయిలీకి ఆరోగ్యం బాగా చెడింది. అది క్షయ అని కనుక్కునే కాలం కూడా కాదు. చివరి పదహారు సంవత్సరాలు అనారోగ్యంతోనే బాధపడ్డాడు. 1836 లో అతనికున్న వ్యాధి గుర్తించారు. క్షయ అంటు వ్యాధి అనే భయం ఉంది. లూయీస్ బ్రెయిలీ దగ్గరకు రావటానికి కొందరు భయపడేవారు. కానీ ఆయన విద్యార్ధులకు మాత్రం లూయీస్ బ్రెయిలీ అంటే విశేష అభిమానం. అందరూ ఆయన వెంటే చేరేవారు. బ్రెయిలీ స్వయంగా తయారు చేసిన స్క్రిప్ట్ ని అందరూ బాగుందన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com