జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ నుంచి మరో కొత్త కారు భారత మార్కెట్లోకి వచ్చింది. ఈ కంపెనీ న్యూ జనరేషన్ ఎక్స్5 ఎస్‌యూవీని గురువారం విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 72.9లక్షలుగా నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ కారును బీఎండబ్ల్యూ ఇండియా గ్రూప్ ప్రెసిడెంట్ హన్స్-క్రిస్టియన్, మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ కలిసి విడుదల చేశారు. దేశీయ మార్కెట్లో అత్యంత ఎక్కువగా అమ్ముడయ్యే కార్ల మోడళ్లలో బీఎండబ్ల్యూ ఎక్స్5 ఒకటి. ఇక తాజా వెర్షన్.. బెంజ్ జీఎల్‌ఈ, వోల్వో ఎక్స్‌సీ90, రేంజ్‌రోవర్ వెలార్, పోర్షే కయెన్నీ, ఆడీ క్యూ7తో పోటీపడనుంది. గత వెర్షన్‌లలానే ఎక్స్5 న్యూజనరేషన్ కారు కూడా భారత వినియోగదారులను ఆకట్టుకుంటుందని హన్స్ విశ్వాసం వ్యక్తం చేశారు. 2018లో బీఎండబ్ల్యూ 11,105 యూనిట్ల వాహనాలను విక్రయించింది. 2017లో విక్రయించిన 9,800 యూనిట్లతో పోలిస్తే ఇది 13శాతం అధికం. కార్లతో పాటు బీఎండబ్ల్యూ బ్రాండ్ నుంచి బైక్‌లకు మంచి ఆదరణే లభిస్తోంది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో కంపెనీకి చెందిన ద్విచక్రవాహనాల విభాగం 597 బైక్‌లను విక్రయించింది.
సరికొత్త ఎక్స్5 ఆవిష్కరించిన సచిన్
Related tags :