కాణిపాకం వినాయకుడు-ఆధ్యాత్మిక వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కాణిపాకంలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సత్యప్రమాణాల వేలుపుగా పేరుపొందాడు ఆ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 13వ తేదీన వినాయక చవితి రోజున ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 వరకూ ఈ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతాయి.
*ఉత్సవాల వివరాలు
సెప్టెంబరు 13వ తేదీన వినాయక చవితి వేడుకలు జరుగుతాయి. 14వ తేదీ ఉదయం ఉత్సవాలకు ధ్వజారోహణం చేస్తారు. రాత్రి స్వామివారిని హంస వాహనంపై ఊరేగిస్తారు. 15న నెమలి వాహనం, 16న మూషిక వాహనం, 17న బంగారు పెద్ద శేష వాహనం, 18న వృషభ వాహనం, 19న గజ వాహనంపై స్వామి దర్శనమిస్తారు. 20న రథోత్సవం జరుగుతుంది. 21వ తేదీ ఉదయం భిక్షాండి, రాత్రి తిరుకళ్యాణం, అశ్వ వాహనంపై స్వామి ఊరేగింపు ఉంటాయి. 22న ధ్వజావరోహణంతో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి, కాగా సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 3 వరకు పదకొండు రోజులపాటు స్వామివారికి ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.
1.దుర్గమ్మకు కాసుల, గజలక్ష్మీ హారాలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మకు ఇద్దరు భక్తులు రూ.40 లక్షల విలువచేసే స్వర్ణాభరణాలను గురువారం అందజేశారు. చెన్నై ఆర్‌.ఎ.పురానికి చెందిన వేణుశ్రీనివాసన్‌ 108 కమలం కాసులు ఉన్న హారాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) కోటేశ్వరమ్మకు అందజేశారు. 1.022 కిలోల బరువున్న ఈ కాసుల హారం విలువ రూ.35 లక్షలుగా దేవస్థానం అధికారులు అంచనావేశారు. హైదరాబాద్‌ నిజాంపేటకు చెందిన వెంకటసుబ్రహ్మణ్య ప్రసాద్‌, విజయ దంపతులు 169 గ్రాముల బరువున్న పచ్చరాళ్లు పొదిగిన గజలక్ష్మీ హారాన్ని ఈవోకు అందజేశారు. ఈ హారం విలువను దేవస్థానం అధికారులు రూ.5 లక్షలుగా అంచనా వేశారు.
2. 11న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ శుద్ధిలో భాగంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజన కార్యక్రమం ఈనెల 11న నిర్వహించనున్నట్లు తితిదే గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈనెల 13 నుంచి 21 వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మందిరం శుద్ధి చేయనున్నట్లు వివరించింది. తిరుమంజనం రోజున ఉదయం 6 నుంచి 11 గంటల వరకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసి శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించింది. శ్రీవారికి నిర్వహించాల్సిన అష్టదళ పాదపద్మారాధన సేవను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇతర ఆర్జిత సేవలన్నీ యథాతథంగా నిర్వహిస్తామని పేర్కొంది. మధ్యాహ్నం నుంచి శ్రీవారి దర్శనం ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది.
3.కంచి పీఠాన్ని సందర్శించిన ప్రణబ్‌
మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గురువారం మధ్యాహ్నం తమిళనాడులోని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. కాంచీపురం సమీపంలోని ఏణాత్తూరులో ఉన్న పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహా విద్యాలయంలో ఏర్పాటుచేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రణబ్‌ కాంచీపురం వచ్చారు. ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత కంచి కామకోటి పీఠానికి చేరుకోగా ఆయనకు మఠం తరపున పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వాగతం పలికి ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి బృందావనంలో, ఇటీవల శివైక్యం పొందిన జయేంద్ర సరస్వతి బృందావనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుత పీఠాధిపతితో కలిసి జయేంద్ర భవనంలో ఉంచిన జయేంద్ర సరస్వతి మైనపు బొమ్మను ప్రణబ్‌ దర్శించుకున్నారు. శంకర విజయేంద్ర సరస్వతితో కొద్దిసేపు ఏకాంతంగా సమావేశమయ్యారు. అక్కడి నుంచి చెన్నై బయలుదేరి వెళ్లారు.
4.పవిత్రాలకు శయనాధివాసం -నేడు నెమలి ఆలయంలో సామూహిక కుంకుమార్చన
నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాల్లో రెండో రోజైన గురువారం ఉదయం పవిత్రశుద్ధి, అగ్ని ప్రతిష్ఠాపన, త్రేతాగ్ని హోమం, ఆదివాసం నిర్వహించారు. సాయంత్రం పవిత్రమాలలకు శయనాధివాసం, సర్వదేవత ఆహ్వానం తదితర పూజలు చేశారు. ప్రధానార్చకులు టి.గోపాలాచార్యులు ఆధ్వర్యంలో రుత్విక బృందం ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తోంది. వివిధ గ్రామాలకు చెందిన దంపతులు యాగశాలలో జరిపినలో హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. పాల పొంగళ్లతో మొక్కులు చెల్లించారు. శుక్రవారం ఉదయం స్వామివారి మూలవిరాట్‌ను పవిత్రాలతో అలంకరిస్తారు. శ్రావణమాసం సందర్భంగా ఆలయంలోని యాగశాలలో శుక్రవారం ఉదయం రాజ్యలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తారు. కార్యనిర్వహణాధికారి వై.శివరామయ్య ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
5.సకుటుంబ సమేత.. త్రినేత్ర గణపతి
సకల విఘ్నాలనూ తొలగించే దైవంగా తొలి పూజలు అందుకొనే వేలుపు గణనాథుడు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారని సూచించే పురాణగాథలు ఉన్నప్పటికీ, ఏ ఆలయంలోనైనా గణేశుడు ఒక్కడే దర్శనమిస్తాడు. ఇద్దరు భార్యలతోనూ కనిపించే ఆలయాలను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అలాంటి అరుదైన కోవెళ్ళలోకెల్లా అరుదైన ఆలయం ఒకటుంది. ఇక్కడ భార్యలతో పాటు పుత్రులతో కూడా కలిసి కొలువుతీరాడు పార్వతీ తనయుడు.
**రాజ్య రక్షకుడ
రణథంబోర్‌ వినాయకుడిని పరమ శక్తిమంతునిగా, రాజ్య రక్షకునిగా స్థానిక చరిత్ర అభివర్ణిస్తోంది. అది క్రీస్తుశకం 1299వ సంవత్సరం. రణథంబోర్‌ రాజు హమీర్‌కూ, ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్‌ ఖిల్జీకీ మధ్య యుద్ధం మొదలైంది. యుద్ధ సమయంలో సైనికుల కోసం ఆహారాన్నీ, అవసరమైన ఇతర సరుకులనూ కోటలోని గోదాముల్లో నిల్వ చేశారు. ఈ యుద్ధం చాలా సంవత్సరాలు సాగడంతో గోదాముల్లో నిల్వలు నిండుకున్నాయి. వినాయకునికి పరమ భక్తుడైన హమీర్‌కు ఏం చెయ్యాలో పాలుపోలేదు. భారమంతా గణపతి మీద వేశాడు. ఒక రోజు రాత్రి అతను నిద్రపోతూండగా ఏకదంతుడు కలలోకి వచ్చాడు. సమస్యలన్నీ మర్నాటి పొద్దుటికల్లా తీరిపోతాయని అభయం ఇచ్చాడు. మరునాడు కోటలోని ఒక గోడ మీద మూడు నేత్రాలున్న వినాయకుని ఆకృతి దర్శనం ఇచ్చింది. దరిమిలా యుద్ధం ముగిసిపోయింది. ఖిల్జీ సేనలు వెనుతిరిగాయి. మరో చిత్రం ఏమిటంటే కోటలోని గోదాములన్నీ సరుకులతో నిండిపోయి ఉన్నాయి. గణేశుడే తన రాజ్యాన్ని రక్షించాడనీ, ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటాడనీ భావించిన హమీర్‌ క్రీ.శ. 1300 సంవత్సరంలో కోటలోనే వినాయక ఆలయాన్ని నిర్మించాడు.
**ఇదీ విశిష్టత
ఈ ఆలయంలో వినాయకుడు మూడు నేత్రాలతో దర్శనం ఇస్తాడు. భార్యలైన రిద్ధి, సిద్ధితోపాటు కుమారులైన శుభ్‌, లాభ్‌ కూడా గణేశునితో పాటు కొలువు తీరి పూజలందుకోవడం ఈ ఆలయ విశిష్టత. ఇలాంటిది మరే వినాయక ఆలయంలోనూ కనిపించదు. స్వామికి ప్రతిరోజూ అయిదు సార్లు హారతులు ఇస్తారు. అర్చకులతోపాటు భక్తులు కూడా సామూహిక ప్రార్థనలూ, భజనగీతాలాపనలూ చేస్తారు. ఈ స్వామిని పూజిస్తే విద్య, విజ్ఞానాలతోపాటు సంపదనూ, సౌభాగ్యాన్నీ అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం.
6. మధురం..ద్వారకాధీశుని ప్రసాదం! -పెదతిరుపతి తరహాలో చినవెంకన్న ఆలయంలో ప్రసాదాలు
చినవెంకన్న ప్రసాదాల కోసం భక్తులు పరితపిస్తారు. స్వామివారి దర్శనం తరువాత ప్రసాదం కోసం క్యూలలో గంటల తరబడి నిరీక్షిస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని దేవస్థానం నాణ్యమైన, రుచికరమైన ప్రసాదాలను భక్తులకు అందుబాటులోకి తెస్తోంది. పెద తిరుపతి తరువాత రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో కూడా అదే తరహాలో ప్రసాదాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఇటీవల పెద్ద లడ్డూ, వడను తయారు చేస్తున్నారు. ఆయా ప్రసాదాలకు భక్తులు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు.కలియుగ ప్రత్యక్ష దైవం ద్వారకాతిరుమల చినవెంకన్న.. కోరిన కోర్కెలు తీర్చే దేవుడని .. కష్టాలను తొలగించే దివ్యమూర్తి అని భక్తుల విశ్వాసం. అందుకే నిత్యం వేలాది మంది ఈ క్షేత్రానికి వస్తున్నారు. ఆ దేవదేవుడి దర్శనం తరువాత ప్రసాదాలను తమతో తీసుకెళ్లి భక్తిశ్రద్ధలతో పూజించి బంధువులు, మిత్రులకు పంచిపెడతారు. ఇక్కడ జరిగే పూజలు, ఉత్సవాలు చూస్తే చాలు ద్వారకాతిరుమల కలియుగ వైకుంఠమేనని ఒప్పుకోక తప్పదు. స్వామివారికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదాలు కూడా ఈ స్థాయిలోనే ఉంటాయి. చక్కెర పొంగలి, పులిహోర, కట్టు పొంగలి, దద్దోజనం, క్షీరాన్నం, కదంబం, లడ్డూ, అతి మధురం,అప్పం, వేణుపొంగలి, మునిహోర ఇలా అనేక ప్రసాదాలను ఒక్కోసమయంలో ఒక్కోటి స్వామివారికి నివేదిస్తామని అర్చకులు తెలిపారు. వాటిని స్వీకరిస్తే ఎంతో పుణ్యమని భక్తుల విశ్వాసం. స్వామివారికి నివేదించిన ప్రసాదాల్లో కొన్నింటిని భక్తులకు విక్రయిస్తున్నారు. 90 గ్రాముల లడ్డూ రూ.15, 200 గ్రాముల పులిహోర పొట్లం రూ.10, 160 గ్రాముల చక్కెర పొంగలి పొట్లం రూ.15చొప్పున విక్రయిస్తున్నారు.వీటితో తిరుమల తరహాలో పెద్ద లడ్డూ, వడ ప్రసాదాలను దేవస్థానం ఇటీవలే భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దేవస్థానం ఈవో స్వయంగా తిరుమల వెళ్లి వాటి తయారీ విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఇక్కడి వంటబ్రాహ్మణులకు శిక్షణ ఇప్పించారు. ఈ క్రమంలో ఇటీవల 400 గ్రాముల లడ్డూనూ రూ.100, 60 గ్రాముల వడ రూ.20 లకు అందుబాటులోకి తెచ్చారు. నాణ్యతలో తేడా లేకుండా, దిట్టంలో రాజీ పడకుండా తయారు చేస్తున్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా తయారీ ధరకే వీటిని భక్తులకు విక్రయిస్తున్నారు. అతి తక్కువ కాలంలో పెద్ద లడ్డూలు సుమారు 6 వేలు, వడ ప్రసాదం సుమారు 5 వేలు తయారు చేశారు. ఎంతో రుచికరమైన, మధురమైన ఈ ప్రసాదాలను భక్తులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. శ్రీవారి నిత్యార్జిత కల్యాణం జరిపించుకొనే భక్తులకు గతంలో చిన్న లడ్డూ ఇచ్చే వారు. ప్రస్తుతం దాని స్థానంలో పెద్దలడ్డూ ఇస్తున్నారు.
7. . అహోబిలం ఆలయంలో గురువారం ఏకాదశి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున లక్ష్మీనృసింహ స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి నిత్యపూజలు చేశారు. అనంతరం ఆలయ ముఖద్వార మండపంలో ప్రహ్లాదవరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారిని కొలువుంచి పంచామృతాలతో అభిషేకం జరిపారు. విశేష అలంకరణలో స్వామి, అమ్మవార్లు పల్లకిపై కొలువుదీరి మేళతాళాల నడుమ ఆలయ తిరువీధుల్లో విహరించారు. ఆలయ ఈవో కామేశ్వరమ్మ, ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్‌ ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు.
8. తిరుమల సమాచారం
* ఈ రోజు శుక్రవారం
*07.09.2018*
ఉ!! 6 గంటల సమయానికి
_తిరుమల°:21C° – 31C°,_
* నిన్న *64,825* మంది
భక్తులకు స్వామివారి దర్శన
భాగ్యం కల్గినది,
* వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో
గదులన్నీ భక్తులతో నిండినది
బైట భక్తులు *సర్వదర్శనం*
కోసం భక్తులు వేచియున్నారు,
* *శీఘ్రసర్వదర్శనం* టోకెన్
పొందినవారి వారికి *03*
గంటల సమయం
పట్టవచ్చును,
*ఈ సమయం సర్వదర్శనం
*టైమ్ స్లాట్* టోకెన్
పొందువారిని *20* గంటల
అనంతరం క్యూ లోకి
అనుమతిస్తారు,
* *ప్రత్యేక దర్శనం* Online
(₹: 300) వారికి *02*
గంటల సమయం
పట్టవచ్చును,
* శ్రీవారి *దివ్యదర్శనం*
(కాలినడక మార్గం ద్వారా)
అలిపిరి లో *14* వేలు
శ్రీవారి మెట్టు లో *6* వేలు
టోకెన్లు జారీ చేయబడును,
* దివ్యదర్శనం *(20వేలు)*
కోటా పూర్తి అయిన
తరువాత వచ్చే భక్తులు,
సర్వదర్శనం భక్తులతో కలిసి
శ్రీవారిని దర్శించుకోవాల్సి
ఉంటుంది,
* నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
*₹:3.11* కోట్లు,
* నిన్న *34,936* మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు,

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com