పాలు-జున్ను వయస్సు 7వేల ఏళ్లు

పాలను పులియబెట్టి జున్ను, పెరుగు వంటి పదార్థాలను తయారుచేయడం.. 7,200 ఏళ్ల కన్నా ముందు నుంచే కొనసాగుతోందని పరిశోధకులు తెలిపారు. ఈ విషయాన్ని రుజువు చేసే ఆధారాలు క్రొయేషియాలో లభ్యమైనట్లు వారు పేర్కొన్నారు. జున్ను వంటి పదార్థాల తయారీ 4వేల ఏళ్ల క్రితం మొదలై ఉండొచ్చని ఇదివరకటి అంచనాలు అభిప్రాయపడ్డాయి. ఇవి తప్పని తాజా అధ్యయనం తేల్చింది. అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్‌ వర్సిటీ పరిశోధకులు దీన్ని చేపట్టారు. క్రొయేషియాలోని డాల్మేషియన్‌ తీరంలో 7,700 ఏళ్ల కన్నా ముందు నుంచే పాలను పాత్రల్లో నిల్వచేయడం ప్రారంభమైందని ఈ అధ్యయనం తేల్చింది. మరో 500 ఏళ్ల తర్వాత పాలను పులియబెట్టి.. జున్ను, పెరుగు వంటి పదార్థాలను తయారుచేయడం మొదలైందని పేర్కొంది. ఆ ప్రాంతంలో నివసించిన జనాల డీఎన్‌ఏపై జరిపిన విశ్లేషణల్లోనూ ఇది స్పష్టమైనట్లు సారా మెక్‌క్లూర్‌ అనే పరిశోధకురాలు తెలిపారు. అంతకుముందు తరాలవారి ఆరోగ్యానికి పాల ఉత్పత్తులు పడేవి కావని.. వారి వారసులకు ఆ సమస్య రాలేదని పేర్కొన్నారు. పాల ఉత్పత్తుల నిల్వకు అనుగుణంగా పాత్రల ఆకారాల్లోనూ మార్పులు వచ్చాయని తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com