NRI-NRT

నాట్స్ టెంపాబేకు నూతన కమిటీ

Tampa Bay NATS Gets New Committes

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) ఫ్లోరిడా రాష్ట్రంలోని టెంపాబే విభాగానికి కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. ప్రసాద్ ఆరికట్ల సమన్వయకర్తగా, సురేశ్ బొజ్జ సంయుక్త సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు…సంస్థ ప్రస్థానంపై మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, బోర్డ్ సెక్రటరీ ప్రశాంత్ పిన్నమనేని, ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మల్లాది అంతర్జాలంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జోనల్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ కాండ్రు, ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, మాజీ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శివ తాళ్లూరు తదితరులు పాల్గొన్నారు. నాట్స్ ఛైర్మన్ అప్పసాని శ్రీధర్, అధ్యక్షుడు విజయశేఖర్‌లు టెంపాబే నూతన ప్రతినిధులకు అభినందనలు తెలిపారు.
నాట్స్ టెంపాబేకు నూతన కమిటీ-Tampa Bay NATS Gets New Committes