వినాయక పత్రిలో ఔషధ గుణాలు

వినాయక చవితి వస్తోంది. సంప్రదాయం ప్రకారం మహా గణనాథునికి 21 రకాల పత్రితో ఆ రోజున పూజలు చేయాలి. పత్రి అంటే పత్రము లేదా ఆకు అని అర్థం. ఇన్ని రకాల పత్రితో గణేషుడికి పూజలు చేయడం పాతకాలం నాటి మాటే. ఈ పత్రులను వినాయక నిమజ్జనం సమయంలో నదులు, కాలువలు, చెరువుల్లో విడిచిపెట్టటం ద్వారా వాటిలోని ఔషధగుణాలు నీటిని శుభ్రం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. పత్రిలో 21 రకాల పత్రాలు ఎన్నో రుగ్మతలను, దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తాయంటే ఆశ్చర్యం కలగకమానదు. పత్రిలో రకాలు… వాటి ప్రత్యేకతలు…
*అర్కపత్రం (జిల్లేడు)
ఓం కపిలాయ నమః అంటూ బొజ్జగణపతికి సమర్పించే ఈ పత్రాన్నే జిల్లేడుగా పిలుస్తారు. సెగ్గడ్డలు, కీళ్లనొప్పులు, చెవి నొప్పి, విడవకుండా వచ్చే దగ్గు, దంత సమస్యలు, తుమ్ములు, విరేచనాలు, బోదకాలు, గాయాల నివారణకు జిల్లేడు దివ్య ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేదంలో ఉంది.
*మాచీ పత్రం
ఓం సుముఖాయ నమః అంటూ సమర్పించే ఈ పత్రం చామంతి జాతికి చెందిన మొక్క. సుగంధం కలిగి ఉంటుంది. ఈ ఆకులు ఎలర్జీ, చర్మవ్యాధులు, తలనొప్పి, నరాల నొప్పులు, కంటి సమస్యల నివారణకు ఉపయోగిస్తారు. ఆస్త్మా నియంత్రణ, గాలిని శుద్ధి చేస్తుంది.
*బృహతిపత్రం
ఓం గణాధిపాయ నమః అంటూ సమర్పించే బృహతీ పత్రాన్ని తెలుగులో వాకుడు, వాకుడాకు, చిన్న ములక, పెద్ద ములక అని రకరకాలుగా పిలుస్తారు. ఈ ఆకులను దగ్గు, రొంప, జ్వరం, అజీర్తి, మూత్రనాళ సమస్య, కంటి జబ్బులు, పంటి నొప్పి, పచ్చకామెర్ల నియంత్రణ, దంతాల శుభ్రతకు ఉపయోగిస్తారు. ఇవి వంక పత్రాల్లా ఉండి, ముళ్లు కలిగి ఉంటాయి.
*ఉత్తరేణి అపామార్గ పత్రం (ఉత్తరేణి)
ఓం గుహాగ్రణాయ నమః అంటూ గణేశునికి సమర్పించే ఈ ఆకులతో చెవి పోటు, పిప్పి పన్ను సమస్య, అనిగెడ్డలు, అధిక ఆకలిని తగ్గించేందుకు, పైల్స్, పాముకాటు నివారణకు ఆయుర్వేద మందుగా ఉపయోగిస్తారు.
*విష్ణుక్రాంత పత్రం
ఓం భిన్నదంతాయ నమః అంటూ పూజించే ఈ పత్రం నీలి తెలుపు పుష్పాలు కలిగి ఉంటుంది. జ్వరం, కోరింత దగ్గు, జలుబు, ఆస్తమా నివారణతో పాటు జ్ఞాపకశక్తి పెంపొందింపచేసేందుకు ఈ పత్రాన్ని ఉపయోగిస్తారు.
*దేవదారు పత్రం (దేవదారు)
ఓం సర్వేశ్వరాయ నమః అంటూ పూజించే ఈ దేవదారు పత్రం హిమాలయాల్లో పెరుగుతుంది. ఇవిఉంటే చెట్ల పరిసరాల్లో దోమలు, ఇతర క్రిమికీటకాలు రావు. వీటి ఆకులు అజీర్ణవ్యాధి, ఉదర సంబంధ, కంటి, చర్మ వ్యాధి నివారణకు, జ్ఞాపకశక్తి, జ్ఞానవృద్ధికి తోడ్పడతాయి.
*మరువకపత్రం (మరువం)
ఓం ఫలప్రదాయ నమః అంటూ మరువపత్రాన్ని గణనాథుడికి సమర్పిస్తారు. ఈ ఆకును జీర్ణశక్తిని పెంచటం, వెంట్రుకలు రాలటాన్ని నివారించేందుకు, చర్మవ్యాధుల నివారణకూ ఉపయోగిస్తారు.
*సింధూవార పత్రం (వావిలి)
ఓం హేరంబాయ నమః అంటూ పూజించే వావిలాకును సింధూవారపత్రంగా పిలుస్తారు. ఇది జ్వరం, తలపోటు, కీళ్లనొప్పులు, గాయాలు, చెవినొప్పి, ప్రసవానంతర సమస్యలు, మూర్ఛ, చర్మవ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తోంది.
*జాజీపత్రం
ఓం శూర్పకర్ణాయ నమః అంటూ పూజించే జాజీపత్రం పశ్చిమ కనుమల్లో దొరుకుతుంది. వాతం నొప్పులు, ఉదర, పెదవులపై పొక్కులు, చెడు వాసన, కామెర్లు, చర్మవ్యాధులను తగ్గించే విశేష గుణాలున్నాయి.
*గండకీ పత్రం (దేవకాంచనం)
ఓం సురాగ్రణాయ నమః అంటూ పూజించే ఈ పత్రాన్ని దేవకాంచనం అని పిలుస్తారు. ఆ ఆకులను కోరింత దగ్గు, ఉదర సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.
*శమీపత్రం(జమ్మి)
ఓం ఇభవక్రాయ నమః అంటూ పూజించే జమ్మిచెట్టును భక్తులంతా దైవంగా భావిస్తారు. ఈ ఆకులు దంత, మూలవ్యాధి, కోరింత దగ్గు, కుష్ణువ్యాధి, విరేచనాల నివారణకు ఉపయుక్తమని ఆయుర్వేదంలో చెబుతారు.
*అర్జున పత్రం (తెల్లమద్ది)
ఓం సురసేవితాయ నమః అంటూ పూజించే ఈ పత్రం చెట్టును తెల్లమద్దిగా పిలుస్తారు. కీళ్ల నొప్పులు, చర్మవ్యాధులు, గుండెకు సంబంధిత జబ్బులను నయం చేసేందుకు తెల్లమద్ది చెక్క, ఆయుర్వేదంతో ఉపయోగిస్తారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com